Second Hand Phone: మీరు సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ కొంటున్నారా..? అది ఒరిజినలా..? కాదా..? ఇలా చెక్‌ చేసుకోండి..!

|

Jul 28, 2022 | 7:16 AM

Second Hand Phone: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోయింది. కానీ స్మార్ట్‌ఫోన్‌లు పోగొట్టుకున్న వారు కూడా చాలా మందే ఉంటారు. సెకండ్‌ హ్యండ్‌ ఫోన్లు కుప్పలు తెప్పలుగా ఎన్నో..

Second Hand Phone: మీరు సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ కొంటున్నారా..? అది ఒరిజినలా..? కాదా..? ఇలా చెక్‌ చేసుకోండి..!
Second Hand Phone
Follow us on

Second Hand Phone: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోయింది. కానీ స్మార్ట్‌ఫోన్‌లు పోగొట్టుకున్న వారు కూడా చాలా మందే ఉంటారు. సెకండ్‌ హ్యండ్‌ ఫోన్లు కుప్పలు తెప్పలుగా ఎన్నో దొరుకుతుంటాయి. కానీ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి కదా సెకండ్‌ హ్యండ్‌లో మొబైళ్లను కొంటే జాగ్రత్తగా ఉండాలి. అన్ని వివరాలు తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అకాశం ఉంది. ఒకసారి వాడిన స్మార్ట్‌ఫోన్‌ మళ్లి కొంటే అన్ని వివరాలు చెక్‌ చేసుకోవడం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరి వద్దనైనా సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ కొనే ముందు జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. ఏం ఆలోచించకుండా కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే మీరు కొనుగోలు చేసే ఫోన్‌ అది మంచిదా..? కాదా, ఒరిజినలేనా.. అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.దీంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్‌లను ట్రాక్‌ చేసేందుకు సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకు ఆస్కారం ఉంటుంది. ఈ పోర్టల్‌ ద్వారా మీరు సెకండ్‌ హ్యండ్‌ కొనుగోలు చేసే మొబైల్‌ ఒవరినలా..? కదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

తెలుసుకోవడం ఎలా..?

మీరు ముందుగా CEIR అనే పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అక్కడ మైన్‌ పేజ్‌లో అప్లికేషన్‌లోకి వెళ్లి అక్కడ Know Your Mobile App, లేదా IMEI Verification అనే రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటిలో IMEI Verification నే రెండింటిని ఎంచుకోండి. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేయండి. తర్వాత మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. తర్వాత ఐఎంఈఐ సూచించిన కాలంలో ఇమెయిజ్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న మొబైల్‌ IMEI నెంబర్‌ తెలియకపోతే మొబైల్‌లో *#06# ప్రెస్‌ చేస్తే మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు ఐఎంఈఐ నెంబర్‌ను నమోదు చేసి సబ్మిట్‌పై నొక్కాలి. వెంటనే వివరాలు వస్తాయి. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు కొనుగోలు చేసిన సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ అది ఒరిజినలా..? లేదా..? అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే దొంగిలించిన ఫోన్లు చాలా మంది అమ్మేసుకుంటారు. అందుకే ముందు ఇలా చెక్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే దొంగిలించబడిన ఫోన్‌పై ఎవరైనా పోలీసు కేసు నమోదు చేసినట్లయితే తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి