Apps: కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ముందు ఈ విషయాలు చెక్‌ చేసుకోండి

మరి నకిలీ యాప్స్‌ బారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి.? ఇలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా ప్లే స్టోర్‌లో లభించే యాప్స్‌ను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఐఫోన్‌ యూజర్లు యాపిల్ స్టోర్‌ నుంచి, ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్‌ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే ఉత్తమం...

Apps: కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ముందు ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
Apps Download

Updated on: May 20, 2024 | 7:29 AM

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగి తర్వాత రకరకాల యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ ఒక్క అవసరానికి ఒక యాప్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో స్మార్ట్ ఫోన్‌ యూజర్లు యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం అవసరంగా మారిపోయింది. దీంతో ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు నకిలీ యాప్స్‌ను తయారు చేస్తూ యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. యాప్‌లో వైరస్‌లను జోడించి ఫోన్‌లను హ్యాక్‌ చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తున్నారు.

మరి నకిలీ యాప్స్‌ బారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి.? ఇలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా ప్లే స్టోర్‌లో లభించే యాప్స్‌ను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఐఫోన్‌ యూజర్లు యాపిల్ స్టోర్‌ నుంచి, ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్‌ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే ఉత్తమం. అలా కాకుండా ఆన్‌లైన్‌లో లభించే యాప్స్‌లో కొన్ని ఫేక్‌ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను ఉంచడానికి ముందు అన్ని రకాల తనిఖీలను నిర్వహిస్తాయి.

ఇక ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే ముందు దానికి సంబంధించిన ప్రైవసీ పాలసీని చదవాలి. యాప్‌కు సంబంధించిన వివరాలను క్షుణ్నంగా గమనించాలి. అలాగే సదరు యాప్‌ మీ మొబైల్‌లో ఎలాంటి సమాచారాన్ని యాక్సెస్‌ చేస్తోంది, ఎలాంటి పర్మిషన్స్‌ అడుగుతుంది లాంటి వివరాలను తెలుసుకోవాలి. ఇక యాప్‌ డేటా కలెక్షన్‌ పాలసీని కూడా గమనించాలి. సదరు యాప్‌ మనకు సంబంధించిన ఎలాంటి వివరాలను సేకరిస్తుందన్న వివరాలను ముందుగానే తెలుసుకోవాలి.

ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే ముందు పరిగణలోకి తీసుకోవాల్సి మరో ముఖ్యమైన విషయం దాని రివ్యూలను కచ్చితంగా పరిశీలించాలి. తక్కువ రేటింగ్‌ ఉన్న యాప్స్‌, నెగిటివ్‌ రివ్యూలు ఉన్న యాప్స్‌ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే ముందు అడిగే పర్మిషన్స్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యాప్స్‌ మైక్రోఫోన్‌, లొకేషన్‌ వంటివి అవసరం లేకపోయినా అడుగుతుంటాయి. అలాంటి వాటి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడమే బెటర్‌.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..