New Smartphones: ఈ నెలలో స్మార్ట్ ఫోన్ల జాతరే.. క్యూ కట్టనున్న బిగ్ బ్రాండ్లు.. మీరూ లుక్కేయండి..

|

Mar 02, 2023 | 8:48 AM

మార్చి లో పెద్ద సంఖ్యలో ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తన లాంచింగ్ డేట్లు ప్రకటించాయి. వాటిల్లో బెస్ట్ ఫీచర్లు, డైనమిక్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఫోన్లు కూడా చాలా ఉన్నాయి.

New Smartphones: ఈ నెలలో స్మార్ట్ ఫోన్ల జాతరే.. క్యూ కట్టనున్న బిగ్ బ్రాండ్లు.. మీరూ లుక్కేయండి..
Smartphones
Follow us on

ఫిబ్రవరిలో పెద్ద సంఖ్యలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. వాటిల్లో శామ్సంగ్ గేలాక్సీ ఎస్23 సిరీస్, ఒప్పో ఫైండ్ ఎన్2 సిరీస్ వంటివి తన ముద్రను వేశాయి. ఇప్పుడు మార్చి లో పెద్ద సంఖ్యలో ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తన లాంచింగ్ డేట్లు ప్రకటించాయి. వాటిల్లో బెస్ట్ ఫీచర్లు, డైనమిక్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఫోన్లు కూడా చాలా ఉన్నాయి. మీరు ఒక వేళ 30,000లోపు ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కోసం కొనుగోలు చేయాలని భావిస్తుంటే వీటిని ట్రై చేయొచ్చు.

వివో వీ27 ప్రో(Vivo V27 Pro).. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 చిప్ సెట్ తో వస్తుంది. 120Hz 3D కర్వ్‪డ్ డిస్ ప్లే ఉంటుంది. అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. దీని వెనుక వైపు కలర్ చేంజింగ్ ఫీచర్ ఉంటుంది. దీనిలో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్766వీ ఇమేజింగ్ సెన్సార్ ఉంటుంది. దీనిలో ఓఐఎస్, ఎల్ఈడీ ప్లాష్ మాడ్యూల్ ఉంటుంది.

పోకో ఎక్స్ టీ జీటీ(Poco X5 GT).. పోకో ఎక్స్ 5 లైనప్ లో మరో ఫోన్ ని కంపెనీ లాంచ్ చేయనుంది. దీనిలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ మెంట్ రేట్ ఉంటుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 7 జెన్2 చిప్ సెట్ ఉంటుంది. ఇది ఎంఐయూఐ14 ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ 13 సామర్థ్యంతో పనిచేస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 50 ఎంజీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఒప్పో ఎఫ్23 5జీ(Oppo F23 5G).. దీనిలో 409 పీపీఐతో కూడిన 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉండే అవకాశం ఉంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ ఉంటుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ కు అవకాశం ఉంటుంది.

మోటో జీ73(Moto G73).. ఇది మీడియా టెక్ 930 చిప్ సెట్ నుంచి శక్తిని పొందుతుంది. దీనిలో 8జీబీ ర్యామ్ ఉంటుంది. దీనిలో 120Hzతో కూడిన 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉండే అవకాశం ఉంది. దీనిలో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తోపాటు 30వాట్ల సామర్థ్యంతో కూడిన ఫాస్ట్ చార్జింగ్ తో పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..