Nothing phone 1: మైండ్‌ బ్లాంక్‌ అయ్యే ఆఫర్‌.. రూ. 749కే నథింగ్ ఫోన్‌ (1). ఎలా సొంతం చేసుకోవాలంటే..

|

Jun 01, 2023 | 5:11 PM

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం నథింగ్ ఫోన్‌ మార్కెట్లో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మునుపెన్నడూ చూడని స్టైలిష్‌ లుక్‌, స్టన్నింగ్ ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్లు తెగ అమ్ముడు పోయాయి. ఇక తాజాగా ఈ కంపెనీ నుంచి నథింగ్ ఫోన్‌ (2)...

Nothing phone 1: మైండ్‌ బ్లాంక్‌ అయ్యే ఆఫర్‌.. రూ. 749కే నథింగ్ ఫోన్‌ (1). ఎలా సొంతం చేసుకోవాలంటే..
Nothing Phone 1
Follow us on

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం నథింగ్ ఫోన్‌ మార్కెట్లో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మునుపెన్నడూ చూడని స్టైలిష్‌ లుక్‌, స్టన్నింగ్ ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్లు తెగ అమ్ముడు పోయాయి. ఇక తాజాగా ఈ కంపెనీ నుంచి నథింగ్ ఫోన్‌ (2) పేరుతో మరో ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నథింగ్‌ ఫోన్‌ (1)పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ. 39,250 ధర ఉన్న ఫోన్‌ను ఏకంగా రూ. 749 కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇంతకీ ఈ ఫోన్‌ను అంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలంటే.

నథింగ్‌ ఫోన్‌ (1) అసలు ధర రూ. 39,250 కాగా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ. 8000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 31,999కి సొంతం చేసుకోవచ్చు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ. 1250 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా ఏకంగా రూ. 30,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌లన్నీ కలుపుకొని నథింగ్ ఫోన్‌ (1)ని రూ. 749కే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే..

ఇక నథింగ్‌ ఫోన్‌ (1) ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌ ఓ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778 జీ+ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్‌,చ 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,500 mAh బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..