స్మోర్ట్ ఫోన్ తయారీలో రోజురోజుకీ మార్పులు వస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా డిజైన్ పరంగా సరికొత్తదనాన్ని పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి కంపెనీలు. ఈ కోవలోకే వస్తాయి ఫోల్డబుల్ ఫోన్స్. మడత పెట్టే ఫోన్‌లకు ప్రస్తుతం మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. అయితే ఫోల్డబుల్ ఫోన్ అనగానే ధర ఎక్కువనే అభిప్రాయం మనలో చాలా మందికే ఉండే ఉంటుంది.
కానీ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా రూ. 30 వేల రేంజ్‌లో లభిస్తోన్న కొన్ని బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* తక్కువ ధరలో లభిస్తోన్న బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్స్‌లో మోటోరోలా రేజర్ 40 ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌ను సేల్‌లో భాగంగా రూ. 33,749 లభిస్తోంది. కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా ర. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 4200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 6.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.
* ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్‌కు చెందిన ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 39,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఆక్టాకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
* అత్యంత తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి టెక్నో ఫాంథామ వీ ఫ్లిప్ ఫోన్ ఒకటి. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 29,899కే సొంతం చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నఅత్యంత చౌకైన ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం.
* మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్‌పైకూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 46,749కి లభిస్తోంది ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..