మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్ లోగో ఫాంట్‌ను ఇటీవల రీడిజైన్ చేసింది. పాత గుర్తింపును అలాగే ఉంచుతూ హైబ్రిడ్ స్టైల్‌లో కొత్త వర్డ్‌మార్క్‌ను తీసుకువచ్చారు. మరింత క్లీన్ లుక్ కోసం తెచ్చిన ఈ మార్పుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తుండటంతో ఈ అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కొత్త లోగో మార్పునకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ తాజా మార్పు ఇన్‌స్టాగ్రామ్ కెమెరా ఐకాన్‌కు ఎలాంటి వర్తించదు. కేవలం ‘Instagram’ అని రాసే అక్షరాల స్టైల్‌ను మాత్రమే మార్చడం జరిగింది. అక్షరాల వంపులు, ఆకారాన్ని మరింత స్పష్టంగా, మోడర్న్‌గా తీర్చిదిద్దారు. పాత బ్రాండ్ గుర్తింపును ఎక్కడా కోల్పోకుండానే, ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా క్లీన్ లుక్ ఇవ్వడం వెనుక పెద్ద ఉద్దేశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఈ కొత్త లుక్ గురించి స్పందిస్తూ ఇది మరింత క్లీన్‌గా ఉందని తెలిపారు.
దశాబ్దం కిందటి ఇన్‌స్టాగ్రామ్‌కు, ఇప్పటి యాప్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కేవలం ఫొటోలు పంచుకోవడమే కాకుండా రీల్స్, స్టోరీస్, డైరెక్ట్ మెసేజింగ్, షాపింగ్ ఇలా ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న కాలానికి, వేదికకు అనుగుణంగా బ్రాండ్ ఇమేజ్‌ను కూడా అప్‌డేట్ చేయడానికే ఈ కొత్త డిజైన్‌ను తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఏదైనా ప్రముఖ సంస్థ లోగోలో కొత్త మార్పు వచ్చినప్పుడు రకరకాల అభిప్రాయాలు రావడం అత్యంత సహజం. ఈ కొత్త వర్డ్‌మార్క్‌పై కూడా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ కొత్త స్టైల్ చాలా బాగుందని అంటుంటే, మరికొందరు మాత్రం పాతదే చదవడానికి ఎంతో సులభంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని అక్షరాల ప్రత్యేక డిజైన్ వల్ల ‘Instagram’ కాస్త ‘Instagzam’లా కనిపిస్తోందని చెబుతూ జోకులు పేలుస్తూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఏళ్ల తరబడి కోట్లాది మంది చూస్తున్న ఒక లోగోలో చిన్న మార్పు చేసినా అది వెంటనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ చేసిన ఈ ప్రయత్నం బ్రాండ్‌ను పూర్తిగా మార్చడం కోసం కాదు, ఉన్న గుర్తింపును మరింత మెరుగుపరచడం కోసమేనని చెప్పవచ్చు. సాధారణ యూజర్లు ఈ కొత్త రూపానికి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టినప్పటికీ, ప్రస్తుతానికైతే ఈ కొత్త లుక్ ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.