Amazon Festival Sale: ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్‌పై భారీ తగ్గింపు.. రూ. 1000లోపే అన్ని టాప్ బ్రాండ్స్.. ఓ లుక్కేయండి..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ఇప్పుడు లైవ్ లో ఉంది. దీనిలో అన్ని వస్తువులపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, టెక్ గ్యాడ్జెట్లు, యాక్ససరీస్ అన్నింటిపై డీల్స ఉన్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్ లకు చెందిన్ హెడ్ ఫోన్లపై కూడా బెస్ట్ డీల్స్ ఉన్నాయి. బోట్, బౌల్ట్, నాయిస్ మొదలైన అగ్ర బ్రాండ్‌ల నుంచి భారీ తగ్గింపుతో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా మరో 10శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

Amazon Festival Sale: ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్‌పై భారీ తగ్గింపు.. రూ. 1000లోపే అన్ని టాప్ బ్రాండ్స్.. ఓ లుక్కేయండి..
Woman Wearing Ear Buds

Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 8:45 AM

ఫెస్టివల్ సీజన్లో కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సేల్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ఇప్పుడు లైవ్ లో ఉంది. దీనిలో అన్ని వస్తువులపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, టెక్ గ్యాడ్జెట్లు, యాక్ససరీస్ అన్నింటిపై డీల్స ఉన్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్ లకు చెందిన్ హెడ్ ఫోన్లపై కూడా బెస్ట్ డీల్స్ ఉన్నాయి. బోట్, బౌల్ట్, నాయిస్ మొదలైన అగ్ర బ్రాండ్‌ల నుంచి భారీ తగ్గింపుతో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా మరో 10శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ లో హెడ్ ఫోన్లపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

బోట్ నిర్వాణా అయాన్‌.. బోట్ కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయిన ఉత్పత్తి ఉంది. వైర్‌లెస్ ఇన్-ఇయర్ బ్లూటూత్ హెడ్‌ఫోన్‌ ఇది. ఇది సింగిల్ చార్జ్ పై 24 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది. ఈ నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు బోట్ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ ద్వారా ఆధారితమైన క్రిస్టల్ బయోనిక్ సౌండ్‌ని కలిగి ఉంటాయి. 4 మైక్స్ ఈఎన్ఎక్స్ టెక్నాలజీతో వస్తుంది, ఇది అవాంఛిత నాయిస్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. మీరు మీ కాల్‌లలో ఉన్నప్పుడు మీ వాయిస్ స్పష్టంగా వినిపించేందుకు ఇది సాయ పడుతుంది. దీని ఎర్గోనామిక్‌గా కాంపాక్ట్ పరిమాణం వాటిని మీ జేబులో లేదా బ్యాగ్‌లో ఎక్కడైనా అమర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఐపీఎక్స్4 రేటింగ్ వస్తుంది. దీనిని అమెజాన్ లో కేవలం రూ. 1,799కే కొనుగోలు చేయొచ్చు.

నాయిస్ బడ్స్ వీఎస్104 ట్రూలీ వైర్ లెస్.. ఇది గరిష్టంగా 45-గంటల ప్లేటైమ్ ను అందిస్తుంది. ఈఎన్సీతో క్వాడ్ మైక్‌లు- మీరు ఎక్కడ ఉన్నా స్వేచ్ఛాయుత సంభాషణ చేయడానికి అనుమతిస్తుంది. కేవలం 10 నిమిషాల చార్జింగ్ తో 200 నిమిషాల ప్లేటైమ్‌ను అందిస్తుంది. బ్లూటూత్ 5.2, హైపర్ సింక్ టీఎం, ఐపీఎక్స్5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ పై అమెజాన్ లో 74శాతం తగ్గింపు లభిస్తుంది. కేవలం రూ. 899కే కొనుగోలు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

నాయిస్ బడ్స్ వీఎస్104 మ్యాక్స్ ట్రూలీ వైర్‌లెస్ ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్‌.. ఇది యాక్టివ్ నాయిస్ కేన్సలేషన్ ఫీచర్తో వస్తుంది. 25డీబీ వరకూ ఎటువంటి డిస్టార్షన్స్ లేకుండా కాల్స్ చేసుకోనేందుకు వీలు పడుతుంది. గరిష్టంగా 45-గంటల ప్లేటైమ్ అందిస్తుంది. క్వాడ్ మైక్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ కంట్రోల్‌తో క్రిస్టల్-క్లియర్ కాల్‌లు, అసాధారణమైన వాయిస్ క్వాలిటీని అందిస్తుంది. 10 నిమిషాల ఛార్జ్ తో 180 నిమిషాల ప్లేటైమ్ ను అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌పై 74 శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. దీని ధర కేవలం రూ. 1,299 గా ఉంది.

ఎయిర్‌డోప్స్ 170 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌.. ఇది గరిష్టంగా తొమ్మిది గంటల ప్లే టైంని అందిస్తుంది. ఈఎన్ఎక్స్ టెక్-ఎనేబుల్డ్ ఎయిర్‌డోప్స్ కాబట్టి కాల్స్ సమయలో ఎటువంటి డిస్టార్షన్స్ ఉండవు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌లో 180 నిమిషాల ప్లేటైమ్‌ అందిస్తుంది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 5.3ని కలిగి ఉంటాయి. ఈ ఇయర్‌బడ్‌లపై 78 శాతం తగ్గింపుతో కేవలం రూ. 999కే దీనిని కొనుగోలు చేయొచ్చు.

బోట్ రాకర్జ్ 255 నియో ఇన్-ఇయర్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌.. ఇది కూడా ఈఎన్ఎక్స్ టెక్నాలజీతో వస్తుంది. స్పష్టమైన వాయిస్ కాల్స్ ను అందిస్తుంది. కేవలం 10 నిమిషాల పాటు వాటిని ఛార్జ్ చేసిన తర్వాత 10 గంటల ప్లేటైమ్‌ను అందించగలుగుతాయి. పూర్తి ఛార్జ్‌పై 25 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని ఆస్వాదించవచ్చు. బ్లూటూత్ 5.2తో మీరు 2 పరికరాలతో ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. ఐపీఎక్స్ 6 రేటింగ్ తో వస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ బోట్ రాకర్జ్ 255 నియో ఇన్-ఇయర్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌పై 78 శాతం తగ్గింపును లభిస్తుంది. అంటే దీనిని రూ. 899 కే కొనుగోలు చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..