Pulsar 180 బైక్​ లవర్స్​కి మరోసారి షాక్ ఇచ్చిన బజాజ్​.. ఇదే చివరి ఛాన్స్​ అవుతుందా ఏంటి?

భారత టూవీలర్ మార్కెట్‌లో Bajaj Pulsar సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్‌, శక్తివంతమైన ఇంజిన్‌తో ఈ బైక్‌లు మంచి ఆదరణ పొందాయి. అయితే ఈ సిరీస్‌లోని కొన్ని మోడళ్ల విషయంలో కంపెనీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ప్రముఖ మోడల్ Pulsar 180 మరోసారి మార్కెట్‌ నుంచి కనుమరుగైనట్లు తెలుస్తోంది. Bajaj Auto అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో ఈ బైక్ కనిపించడం లేదు. దీంతో దీని ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేస్తున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Pulsar 180 బైక్​ లవర్స్​కి మరోసారి షాక్ ఇచ్చిన బజాజ్​.. ఇదే చివరి ఛాన్స్​ అవుతుందా ఏంటి?
Bajaj Pulsar 180

Updated on: Nov 19, 2026 | 9:20 PM

ఒకప్పుడు 180cc విభాగంలో మంచి గుర్తింపు సంపాదించిన ఈ బైక్‌ను కంపెనీ తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చిన కొద్ది నెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. గత ఐదేళ్లలో Pulsar 180 నిలిచిపోవడం ఇది రెండోసారి. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో Pulsar 125, Pulsar 150, Pulsar 220F మోడళ్లు కొనసాగుతున్నాయి. అయితే Pulsar 180 విషయంలో కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఈ బైక్ పూర్తిగా నిలిచిపోయిందని ఇప్పుడే నిర్ధారించలేం.

ఆరు నెలల్లోనే..

Bajaj తొలిసారిగా 2022లో Pulsar 180ను మార్కెట్‌ నుంచి తొలగించింది. అయితే ఈ మోడల్‌కు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని 2026 ఏప్రిల్‌లో మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో TVS Apache RTR 180కు పోటీగా ఈ బైక్‌ను తిరిగి ప్రవేశపెట్టినట్లు భావించారు. కానీ తాజాగా కంపెనీ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత Pulsar 180ను ‘Original’ విభాగం నుంచి తొలగించారు. ఈ పరిణామం నేపథ్యంలో మళ్లీ ఉత్పత్తి నిలిపివేత దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.

178.6cc ఇంజిన్‌..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న Bajaj Pulsar 180లో 178.6cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ ఉంది. ఇది 8,500rpm వద్ద 17hp పవర్‌, 6,500rpm వద్ద 15Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.22 లక్షలుగా ఉంది. TVS Apache RTR 180తో పోలిస్తే సుమారు రూ.4,000 తక్కువ ధరకు లభిస్తోంది. ప్రస్తుతం డీలర్‌షిప్‌లలో ఉన్న స్టాక్ మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ కొనాలనుకునే వారు సమీపంలోని Bajaj షోరూమ్‌లో స్టాక్ వివరాలు తెలుసుకోవడం మంచిది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే కంపెనీ మళ్లీ ఈ మోడల్‌ను తీసుకొచ్చే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేం.

Loading...
Unable to load recommendations.
Follow Us