AI: మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవాలని ఉందా.? ఏఐతో సాధ్యమే..

|

Nov 03, 2024 | 3:22 PM

మనిషి ఎప్పుడు చనిపోతారన్న విషయాన్ని తెలుసుకోవడం అసాధ్యమని మనకు తెలిసిందే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి పరిశోధనలు కూడా మొదలయ్యాయి. ఏఐ డెత్ కాలిక్యులేటర్ పేరుతో తీసుకొస్తున్న ఈ టెక్నాలజీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

AI: మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవాలని ఉందా.? ఏఐతో సాధ్యమే..
Ai Death
Follow us on

పుట్టుక, చావు.. ఈ రెండు ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. మీ పుట్టిన తేదీ ఎప్పుడంటే మీ దగ్గర సమాధానం ఉంటుండొచ్చు కానీ మీరు ఎప్పుడు చనిపోతారన్న దానికి మాత్రం సమాధానం ఎవరి దగ్గర ఉండదు. అయితే ప్రస్తుత ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచంలో అది కూడా సాధ్యమే అని నిపుణులు అంటున్నారు.

మనిషి ఎప్పుడు చనిపోతాడో కూడా చెప్పేసే టెక్నాలజీ వచ్చేస్తోంది. త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఖాయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. సైన్స్ భాషలో, ఈ టెక్నాలజీని AI డెత్ కాలిక్యులేటర్‌గా పిలుస్తున్నారు. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

లాన్సెట్‌ డిజిటల్ హెల్త్ ప్రచురించిన ఈ అధ్యయనంలో AI డెత్ కాలిక్యులేటర్ గురించి ప్రస్తావించారు. AI సహాయంతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు అని ఇందులో పేర్కొన్నారు. ఈ కాలిక్యులేటర్ ట్రయల్‌ యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన రెండు ఆసుపత్రుల్లో త్వరలోనే ప్రారంభించనున్నారని పరిశోధకులు తెలిపారు. ఇక ఇక ఏఐ డెత్ కాలిక్యుటేలర్‌ అసలు పేరు AIRE. అంటే AI-ECG రిస్క్ ఎస్టిమేటర్.

ఇది మీ గుండె వైఫల్యాన్ని అంచనా వేస్తుంది. మీ గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం ఎప్పుడు ఆగిపోతుందో ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్‌ చెబుతుందన్నమాట. అంటే మీకు సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుందన్న విషయాన్ని ఇది అంచనా వేయగలుగుతుంది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఆసుపత్రుల్లో వేలాది మంది ఈ ట్రయల్‌లో పాల్గొంటున్నారు. ప్రజలు దీనికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యులు సులభంగా గుర్తించలేని వ్యాధుల గురించి కూడా ఈ AI డెత్ కాలిక్యులేటర్ చెబుతోంది.

ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా ఈ కాలిక్యులేటర్ 78 శాతం కరెక్ట్‌గా చెబుతోంది. ఈ AI డెత్ కాలిక్యులేటర్‌ను రూపొందిస్తున్న సంస్థ.. 11.60 లక్షల మంది రోగులకు ECG రిపోర్ట్‌లను సేకరించింది. వీటిని విశ్లేషించడం ద్వారా వారి గుండె ఎపపుడు ఆగిపోతుందన్న వివరాలను ప్రచురించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..