త్వరలో ఐఫోన్లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్!

అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన సుప్రసిద్ధ ఐఫోన్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.  యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో, మాక్ రూమర్స్ వెబ్ సైట్ కథనం ప్రకారం తర్వాతి తరం ఐఫోన్ లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండనున్నట్టు తెలిసింది. ఈ ఫీచర్ తో మీరు మీ ఇతర డివైస్‌లను ఐఫోన్ ఉపయోగించి ఛార్జింగ్ చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్10, హువావీ మేట్ 20 ప్రో, హువావీ పీ30 ప్రో వంటి […]

త్వరలో ఐఫోన్లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్!
Follow us

|

Updated on: Apr 03, 2019 | 6:31 PM

అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన సుప్రసిద్ధ ఐఫోన్లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.  యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో, మాక్ రూమర్స్ వెబ్ సైట్ కథనం ప్రకారం తర్వాతి తరం ఐఫోన్ లలో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండనున్నట్టు తెలిసింది. ఈ ఫీచర్ తో మీరు మీ ఇతర డివైస్‌లను ఐఫోన్ ఉపయోగించి ఛార్జింగ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్10, హువావీ మేట్ 20 ప్రో, హువావీ పీ30 ప్రో వంటి ఇతర ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ తో వచ్చేశాయి. ఈ ఫీచర్ కోసం శాంసంగ్ కొత్తగా బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా విడుదల చేసింది. పవర్ షేర్ ఫీచర్ తో మీరు గెలాక్సీ బడ్స్ కేస్ ని శాంసంగ్ గెలాక్సీ ఎస్10 వెనుకపెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. మరో ఫోన్ లేదా మరో ఉపకరణంతో కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చు. కానీ అది ఏదైనా క్యూఐ కంపాటిబుల్ డివైస్ అయి ఉండాలి. ప్రస్తుతం యాపిల్ తన ఎయిర్ పాడ్స్ ను వైర్ లెస్ ఛార్జింగ్ కేస్ తో అమ్ముతోంది. అందువల్ల రాబోయే ఐఫోన్ పైన అమర్చుకొనే కొత్త కేస్ ను త్వరలోనే యాపిల్ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

మింగ్-చి కువో ప్రకారం యాపిల్ తన అన్ని ఉత్పత్తులకు ఈ కొత్త ఫీచర్ చేర్చవచ్చు. ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఆర్ ల అప్ డేట్స్ లో టూ-వే వైర్ లెస్ ఛార్జింగ్ ఉండవచ్చని కువో అంచనా వేస్తున్నారు. అలాగే కొత్త ఫీచర్ తో బ్యాటరీ త్వరగా అయిపోకుండా యాపిల్ తన బ్యాటరీల సైజులను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. తర్వాతి ఐఫోన్ ఎక్స్ఎస్ లో 20-25 శాతం బ్యాటరీ సామర్థ్యం పెరుగుదల ఉండవచ్చు. తర్వాతి ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ లో ఇది 10-15 శాతంగా ఉండవచ్చు. ఇప్పటికే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఐఫోన్ ఎక్స్ఆర్ లో పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని కువో చెబుతున్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..