Apple store in India: వచ్చే ఏడాది ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌..!

|

Feb 28, 2020 | 9:22 PM

యాపిల్ ఫోన్స్‌కు ప్రపంచంలో ఎంత డిమాండ్ ఉందోొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనికవర్గం ఈ ఫోన్స్ కొనేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. భారత్‌లో యాపిల్ స్టోర్‌ను 2021లో ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. క్యాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్‌ కంపెనీ వార్షిక షేర్‌హోల్డర్‌ సమావేశంలో..ఆ సంస్థ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ టిమ్‌కుక్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన చేశారు.

Apple store in India:  వచ్చే ఏడాది ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌..!
Follow us on

Apple store in India:  యాపిల్ ఫోన్స్‌కు ప్రపంచంలో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనికవర్గం ఈ ఫోన్స్ కొనేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. భారత్‌లో యాపిల్ స్టోర్‌ను 2021లో ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్‌ కంపెనీ వార్షిక షేర్‌హోల్డర్‌ సమావేశంలో..ఆ సంస్థ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ టిమ్‌కుక్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన చేశారు. స్టోర్‌ ఏర్పాటుకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉందని తెలిపారు. 2018లోనే భారత్‌లో స్టోర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి కోరగా,  ఇండియాలో ఉన్న చట్టాలకు అనుగుణంగా..డొమెస్టిక్ పార్టనర్ భాగస్వామ్యంతో స్టోర్ ఏర్పాటు చెయ్యాలని చెప్పడంతో వెనక్క తగ్గినట్టు వెల్లడించారు.

2021లో లోకల్ భాగస్వామ్యం లేకుండానే స్టోర్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్టు టిమ్‌కుక్ పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్.. యాపిల్ కంపెనీ లావాదేవీలు, కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. యాపిల్‌ ఉత్పత్తులైన మ్యాక్‌బుక్‌ ల్యాప్‌టాప్స్‌, ఐఫోన్‌ వంటి ప్రొడక్స్ విడిభాగాలన్నింటిని చైనా తయారు చేస్తుందని, తాజాగా అక్కడ పరిశ్రమలు మూతపడటంతో క్రయవిక్రయాలు సరిగ్గా జరగడం లేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :‘కేజీఎఫ్​’ హీరో హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్​కౌంటర్​…