AYYA T1 Smartphone: యాపిల్‌ ఫోన్‌కు ధీటుగా రష్యా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..!

AYYA T1 Smartphone: ఉక్రెయిన్‌- రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ కంపెనీ..

AYYA T1 Smartphone: యాపిల్‌ ఫోన్‌కు ధీటుగా రష్యా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..!

Updated on: Mar 07, 2022 | 7:30 PM

AYYA T1 Smartphone: ఉక్రెయిన్‌- రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ కంపెనీలు రష్యా (Russia)కు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. ఇక తాజాగా రష్యా ఈ కంపెనీలకు ధీటుగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తమదేశ పౌరుల కోసం స్వదేశీ స్మార్ట్‌ఫోన్‌ ‘అయ్య టీ1(AYYA T1) అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రష్యా వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లను స్కేల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనుబంధ సంస్థ స్మార్ట్‌ ఇకో సిస్టమ్‌ కంపెనీ అభివృద్ధి చేస్తోందని పేర్కొంది. ఐఫోన్లకు బదులు అయ్య టీ1 స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించాలని తమ దేశ పౌరులను రష్యా కోరడం గమనార్హం.

ఫీచర్స్‌..

ఈ స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్స్‌పై ఇతరులు నిఘా పెట్టకుండా ఉండడానికి కెమెరాలు, మైక్రోపోన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసేలా ప్రత్యేక హార్డ్‌వేర్‌ బటన్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్‌ ధర సుమారు 15 నుంచి 19 వేల రూబెల్స్‌ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మీడియాటెక్‌ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 6.5 అంగుళాల సైజు, 4జీబీ ర్యామ్‌, 64 ఇంటర్నల్‌ స్టోరేజీ, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ, రెండు ప్రధాన కెమెరాలు, 12ఎంపీ, 5ఎంపీ డిజిటల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Vehicle Tires: టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి.. అసలైన కారణాలు ఏమిటో తెలిస్తే..

Microsoft Hyderabad: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి.. మైక్రోసాఫ్ట్‌తో డీల్‌ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం

Follow Us