యాపిల్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ గ్యాడ్జెట్‌ కోసం 2027 వరకు ఆగాల్సిందేనట

Apple Camera-Equipped AirPods.. టెక్ దిగ్గజం యాపిల్ నుంచి కెమెరాతో కూడిన కొత్త ఎయిర్‌పాడ్స్ రాబోతున్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా టెక్ ప్రియులను ఖుషీ చేశాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల మాకోస్ వెర్షన్‌లో వీటికి సంబంధించిన ఒక డెమో వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే యాపిల్ ప్రియులను నిరాశపరుస్తూ ఈ ఎయిర్‌పాడ్స్ లాంచ్ కాస్త ఆలస్యం కానుందని సమాచారం.

యాపిల్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ గ్యాడ్జెట్‌ కోసం 2027 వరకు ఆగాల్సిందేనట
Apple Camera Equipped Airpods

Updated on: Aug 23, 2026 | 8:20 AM

యాపిల్ త్వరలో విడుదల చేయాలనుకుంటున్న కెమెరా ఆధారిత ఇయర్‌పాడ్స్ లాంచ్ వాయిదా పడినట్లు టెక్ వర్గాలు వెల్లడించాయి. 2027 వరకు ఈ కొత్త వేరబుల్ డివైస్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాయిదా వెనుక ఉన్న కారణాలు, పూర్తి వివరాలను తెలుసుకుందాం.

విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు

టెక్ దిగ్గజం యాపిల్ నుంచి కెమెరాతో కూడిన కొత్త ఎయిర్‌పాడ్స్ రాబోతున్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా టెక్ ప్రియులను ఖుషీ చేశాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల మాకోస్ వెర్షన్‌లో వీటికి సంబంధించిన ఒక డెమో వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఇవి ఈ ఏడాదే మార్కెట్‌లోకి వస్తాయని అందరూ భావించారు. అయితే యాపిల్ ప్రియులను నిరాశపరుస్తూ ఈ ఎయిర్‌పాడ్స్ లాంచ్ కాస్త ఆలస్యం కానుందని సమాచారం.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం యాపిల్ తమ కెమెరా ఆధారిత ఇయర్‌పాడ్స్‌ను ఈ ఏడాది విడుదల చేయడం లేదు. దీనికోసం మనం 2027 వరకు వేచి చూడాల్సిందేనని టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మాన్ వెల్లడించారు. యాపిల్ తమ 20వ వార్షికోత్సవ ఐఫోన్, అలాగే రెండవ తరం ఫోల్డబుల్ ఐఫోన్‌లతో పాటు ఈ కొత్త వేరబుల్ డివైస్‌ను ఒకేసారి మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతో తమ కొత్త AI ఉత్పత్తులను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

యాపిల్ తీసుకొస్తున్న ఈ ఇయర్‌పాడ్స్‌లో ఉండే కెమెరాలు సాధారణంగా మనం ఫొటోలు తీసేందుకు ఉపయోగపడవు. ఇవి విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో పనిచేస్తాయి. మనం దేనినైనా చూస్తున్నప్పుడు ఆ ప్రదేశం లేదా వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలను మన ఇయర్ బడ్స్ ద్వారా సిరి వివరిస్తుంది. దీనికోసం తక్కువ రిజల్యూషన్ ఉన్న డేటాను మాత్రమే వాడతారు. దీంతో ప్రైవసీకి కూడా ఎలాంటి భంగం వాటిల్లదు. అలాగే బ్యాటరీ కూడా త్వరగా అయిపోకుండా ఉంటుంది.

ప్రో సిరీస్‌లో విడుదల

ఈ కెమెరా ఎయిర్‌పాడ్స్ ఎంతో ప్రత్యేకమైనవి కాబట్టి యాపిల్ వీటిని AirPods Ultra పేరుతో తీసుకువస్తుందని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ తాజా నివేదికల ప్రకారం వీటిని AirPods Pro వేరియంట్లలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మాకోస్ Tahoe వెర్షన్‌లో లభించిన సమాచారం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మొత్తానికి లాంచ్ కాస్త ఆలస్యమైనప్పటికీ సిరి పనితీరును మరింత మెరుగుపరచడానికి, హార్డ్‌వేర్‌ను పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయడానికి యాపిల్‌కు మంచి సమయం దొరికినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కొత్త టెక్నాలజీతో కూడిన ఎయిర్‌పాడ్స్ మార్కెట్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us