
One Plus: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన సరసమైన స్మార్ట్‌ఫోన్ OnePlus Nord 2ని ఈ సంవత్సరం జూలైలో విడుదల చేసింది. ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు ఈ మోడల్‌కి సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి. ఈసారి పేలుడులో వినియోగదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పేరు సుచిత్ అతని ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఫోన్ పేలిన తర్వాత సుచిత్ శర్మ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో పాడైన ఫోన్‌తో పాటు కాలిన గాయాలను కూడా చూపే ప్రయత్నం చేశాడు.
ఈ రోజుల్లో OnePlus బ్రాండ్ బాగా ప్రాచుర్యం పొందుతుంది. కానీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వన్‌ప్లస్ వినియోగదారులు వన్‌ప్లస్ ఇండియాను ట్యాగ్ చేసి మీ కంపెనీ నుంచి దీనిని ఊహించలేదని రాశారు. మీ ఉత్పత్తి ఏం చేసిందో చూడండి. ఫలితం కోసం సిద్ధంగా ఉండండి. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయండి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వన్‌ప్లస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని వినియోగదారుని సంప్రదిస్తామని తెలిపింది. అతడికి తగిన న్యాయం చేయడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొంది.
OnePlus పేలుడు మొదటి సంఘటన ఆగస్టు 1, 2021 న వెలుగులోకి వచ్చింది. ఇందులో సోషల్ మీడియా వినియోగదారు అంకుర్ శర్మ తన భార్య సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఈ పోన్ పేలిపోయిందని చెప్పారు. అతను సోషల్ మీడియాలో పేలుడు ఫోటోను కూడా షేర్ చేశాడు. సెప్టెంబర్ 8, 2021న ఢిల్లీలో రెండో కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌరవ్ గులాటీ స్మార్ట్‌ఫోన్ పేలుడుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెప్టెంబరు 8న తన కార్యాలయంలో (కోర్ట్ ఛాంబర్) కూర్చున్నానని తన జేబులో వేడిని గమనించి ఫోన్‌ను బయటకు తీయగానే అందులో నుంచి పొగలు వచ్చాయని చెప్పాడు.