Ambrane Smartwatch: రఫ్ లుక్‌లో కేక పెట్టిస్తున్న స్మార్ట్ వాచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాస్ట్ అంతే..

|

May 31, 2023 | 3:54 PM

కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకొని నిలబడ గలిగే డిజైన్ తో దేశీయ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ ఆంబ్రేన్ సరికొత్త స్మార్ట్ వాచ్ సిరీస్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో. ఇది మిలటరీ గ్రేడ్ పరీక్షల్లో కూడా చెక్క చెదరనంతా ధృడంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

Ambrane Smartwatch: రఫ్ లుక్‌లో కేక పెట్టిస్తున్న స్మార్ట్ వాచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాస్ట్ అంతే..
Ambrane Crest Pro
Follow us on

కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకొని నిలబడ గలిగే డిజైన్ తో దేశీయ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ ఆంబ్రేన్ సరికొత్త స్మార్ట్ వాచ్ సిరీస్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో. ఇది మిలటరీ గ్రేడ్ పరీక్షల్లో కూడా చెక్క చెదరనంతా ధృడంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది చేతికి మరింత అందాన్నిచ్చే సొగసైన రూపంలో ఉంటుందని పేర్కొంది. చూడటానికి స్పోర్టీ, రఫ్ లుక్, రగెడ్ డిజైన్‍తో ఉన్న ఈ ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్ వాచ్ లో ప్రీమియం మెటల్ కేస్, స్క్రీన్ సంరక్షణ కోసం టఫ్ ఎండ్ గ్లాస్ ఉంది. రౌండ్ షేప్డ్ లుసిడ్ డిస్‍ప్లే ఉంది. 100కు పైగా మార్చుకోదగిన వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఈ వాచ్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వంటివి ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

1.52 ఇంచుల రౌండ్ షేప్ ఫుల్ టచ్ లుసిడ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్ వచ్చింది. 360×360 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్‍ను ఈ డిస్‍ప్లే కలిగి ఉంది. రోటేటింగ్ క్రౌన్ ఉంది. ఈ వాచ్‍కు మూడు ఫంక్షనల్ బటన్స్ ఉన్నాయి. బిల్ట్ ఇన్ కంపాస్ ఉంటుంది. దీనివల్ల అడ్వెంచర్లలో నావిగేషన్ సులభతరం అవుతుంది. 100కు పైగా కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ వాచ్‍లో 400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫుల్ చార్జ్‌పై ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఆంబ్రేన్ పేర్కొంది.

ఫీచర్లు ఇవి..

బ్లూటూత్ కాలింగ్‍ ఫీచర్‌తో ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ వచ్చింది. దీంతో ఫోన్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారా కాల్స్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఫోన్ మ్యూజిక్ ప్లే బ్లాక్‍ను, కెమెరాను వాచ్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను పొందవచ్చు. ఇక హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే.. హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2, బ్లడ్ ప్లజర్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లను ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ కలిగి ఉంది. విభిన్న స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ ధర రూ.2,499గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఆంబ్రేన్ వెబ్‍సైట్‍లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, గ్రీన్, కామోఫ్లాజ్ గ్రీన్, కామోఫ్లాజ్ బ్రౌన్, కామోఫ్లాజ్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..