Amazon Mega Summer Days Sale: హాట్‌ హాట్‌ సమ్మర్‌లో కూల్‌ ఆఫర్స్‌.. ఏసీ, ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్స్‌..

Amazon Mega Summer Days Sale: ఎండలు దంచికొడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలోనే ఇంట్లో ఓ ఏసీ ఉంటే ఎంత..

Amazon Mega Summer Days Sale: హాట్‌ హాట్‌ సమ్మర్‌లో కూల్‌ ఆఫర్స్‌.. ఏసీ, ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్స్‌..
Amazon Summer Sale

Updated on: May 17, 2022 | 11:13 AM

Amazon Mega Summer Days Sale: ఎండలు దంచికొడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా 50 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇంట్లో ఓ ఏసీ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది కదూ. కానీ ధరలు చూస్తే ఎండల కంటే ఎక్కువ ఎక్కువగా మండుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మెగా సమ్మర్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మే 18తో ముగియనున్న ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయన్న వివరాలు మీకోసం..

  1. ఏసీల విషయానికొస్తే 120 స్వ్కేర్‌ ఫీట్‌ గదికి సరిపోయే 1 టన్‌ ఏసీలపై ఆకట్టుకునే డిస్కౌంట్‌లు అందిస్తున్నారు. ప్రారంభ ధర రూ. 25,499 నుంచి అందుబాటులో ఉన్నాయి.
  2. 180 స్వ్కేర్‌ ఫీట్‌ గదికి సరిపోయే 1.5 టన్‌ ఏసీ ప్రారంభ ధర రూ. 25,499 నుంచి ఉన్నాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. 80 స్వ్కేర్‌ ఫీట్‌ గదికి సరిపోయే 2 టన్‌ ఏసీ ప్రారంభ ధర రూ. 38,990 నుంచి మొదలు కానున్నాయి. వీటితో పాటు టాప్‌ బ్రాండ్‌కు చెందిన ఏసీలపై నో కాస్ట్‌ ఈఎమ్‌ఐతో పాటు 40 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తున్నాయి.
  5. ఇక రిఫ్రిజిరేటర్ల విషయానికొస్తే సింగల్‌ డోర్‌ ఫ్రిడ్జ్‌లు రూ. 9,790 నుంచి అందుబాటులో ఉన్నాయి.
  6.  డబుల్‌ డోర్‌ రిఫ్రిజిరేట్లు రూ. 18,790 నుంచి అందుబాటులో ఉన్నాయి.
  7.  సామ్‌సంగ్‌, ఎల్‌జీ, వాల్‌పూల్‌, బ్లూస్టార్‌, ఐఎఫ్‌బీతో పాటు మరికొన్ని టాప్‌ బ్రాండ్‌లపై మే 18 వరకు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
  8.  వీటిలో పాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌పై కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.