నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్తగా 20వేల ఉద్యోగాలు

| Edited By:

Jun 28, 2020 | 7:11 PM

కరోనా వేళ ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లో సుమారు 20వేల తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్తగా 20వేల ఉద్యోగాలు
Follow us on

కరోనా వేళ ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లో సుమారు 20వేల తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అవసరమైన సేవలను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. వీరితో రానున్న ఆరు నెలల పాటు వినియోగదారుల అవసరాలు తీర్చడంలో ఇబ్బంది ఉండదని అమెజాన్ వినియోగదారుల సేవా విభాగం ఇండియా డైరెక్టర్ అక్షయ్ ప్రభు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పాటు మరో పది నగరాల్లో ఉన్న అమెజాన్ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అక్షయ్ కోరారు. కాగా 2025లోపు భారత్‌లో సుమారు పది లక్షల ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నామని ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.