Amazon Offer: రూ. 31,999ల ఫోన్ కేవలం రూ. 8,290కే.. అది కూడా 5జీ.. మైండ్ బ్లోయింగ్ ఆఫర్ భయ్యా..

అయితే మీకిదే బెస్ట్ ఆప్షన్! అమెజాన్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్ మీరు వినియోగించుకోవచ్చు. దీనిలో రూ. 31,999 ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 8290 కే లభిస్తోంది.

Amazon Offer: రూ. 31,999ల ఫోన్ కేవలం రూ. 8,290కే.. అది కూడా 5జీ.. మైండ్ బ్లోయింగ్ ఆఫర్ భయ్యా..
Oppo F21 Pro

Edited By: Anil kumar poka

Updated on: Jan 08, 2023 | 4:43 PM

మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకొంటున్నారా? ఏదైనా మంచి 5జీ ఫోన్ అయితే బాగుండు అనుకుంటున్నారా? అది కూడా ఏదైనా ఆఫర్ లో తక్కువ ధరకు వస్తుందని ఎదురు చూస్తున్నారా? అయితే మీకిదే బెస్ట్ ఆప్షన్! అమెజాన్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్ మీరు వినియోగించుకోవచ్చు. దీనిలో రూ. 31,999 ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 8290 కే లభిస్తోంది. ఈ హాట్ డీల్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అమెజాన్లో ఒప్పోవర్స్ డేస్..

ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒప్పో స్మార్ట్ ఫోన్లపై మంచి ఆఫర్లను అందిస్తోంది. ఒప్రోవర్స్ డేస్ పేరిట జనవరి 5 నుంచి జనవరి 10వ తేదీ వరకూ ఈ ఆఫర్లను కొనసాగించనుంది. దీనిలో చాలా ఫోన్లను ఆఫర్లను ప్రకటించింది. ఈ డీల్స్ లో ఆకట్టుకున్న ఆఫర్ ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ(Oppo F21 Pro 5G). మంచి కలర్ గ్రేడియంట్ ఉండే దీని లుక్ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తుంది. దీనిపై ఉన్న ఆఫర్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భారీ తగ్గింపు..

Oppo F21 Pro 5G.. 8జీబీ ర్యామ్ తో పాటు 128 జీజీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. దీనిపై అమెజాన్ ఒప్పో వర్స్ డేస్ సేల్ లో భారీ తగ్గింపు తోపాటు ఏదైనా పాత ఫోన్ ఎక్స్ చేంజ్ తో అతి తక్కువ ధరకు అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ. 6,009 డిస్కౌంట్ తో రూ. 25,990 కి లభిస్తుంది. అంతే కాక పలు బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో కనీసం రూ. 5000 , ఆపై లావాదేవీపై 10 శాతం డిస్కౌం తో గరిష్టంగా రూ. 2500 వరకూ తగ్గింపు వస్తుంది. అలాగే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కనీసం రూ. 12,000, అంతకన్నా ఎక్కువ ధరతో లావాదేవి జరిపితే 7.5 శాతం తగ్గింపు ఉంటుంది. అలాగే హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎక్స్ ఛేంజ్ పై కూడా..

అలాగే ఏదైనా పాత ఫోన్ ఎక్స్ ఛేంజ్ చేస్తే రూ. 15,200 వరకూ లభిస్తుంది. సాధారణంగా వస్తున్న డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స ఛేంజ్ అన్నీ కలిపితే ఈ ఫోన్ కేవలం రూ. 8290కే దక్కుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..