Vivo Y56 5G: వావ్ అనేలా వివో 5జీ ఫోన్.. ధర ఎంత ఉండొచ్చు? లాంచింగ్ డేట్ ఎప్పుడో తెలుసుకోండి..

|

Feb 14, 2023 | 2:30 PM

భారతీయ మార్కెట్లో వివో వై 56 5జీ ఫోన్ ధర రూ. 18,999గా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఫిబ్రవరి 15న లాంచ్ చేయనున్నారు.

Vivo Y56 5G: వావ్ అనేలా వివో 5జీ ఫోన్.. ధర ఎంత ఉండొచ్చు? లాంచింగ్ డేట్ ఎప్పుడో తెలుసుకోండి..
Vivo 5g
Follow us on

మార్కెట్లో 5జీ ట్రెండ్ మొదలైంది. ఎయిర్ టెల్, జీయో వేగంగా తమ 5జీ నెట్ వర్క్ ను విస్తృతం చేస్తుండగా.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా అంతే వేగంగా 5జీ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఇదే క్రమంలో వివో(Vivo) భారతీయ మార్కెట్లోకి తన వై100(Vivo Y100 )మోడల్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటు మరిని వై సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వివో వై56 మోడల్ ను  ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 15 న భారతీయ మార్కెట్లో కి దీనిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ది టెక్ అవుట్‌లుక్ సహకారంతో తీసుకొస్తున్న ఈ వివో వై 56 ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు, ఇతర ఫీచర్లతో పాటు లుక్ ఇప్పుడు చూద్దాం.

ధర ఎంతంటే..

భారతీయ మార్కెట్లో వివో వై 56 5జీ ఫోన్ ధర రూ. 18,999గా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఫిబ్రవరి 15న లాంచ్ చేయనున్నారు. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ పోన్ చిత్రాలను బట్టి పవర్, వాల్యూమ్ బటన్స్ కుడిపైపు ఏర్పాటు చేశారు.

లీకైన స్పెసిఫికేషన్‌లు..

స్మార్ట్‌ఫోన్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.58-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ మాలి జీ52 జీపీయూ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ ని కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

కెమెరా ఇలా..

వివో వై56 5జీ ఫోన్ లో 50ఎంపీ ప్రైమరీ రియర్ షూటర్, 2ఎంపీ సెకండరీ కెమెరాతో అమర్చబడి ఉంటుంది. వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీనిలోని బ్యాటరీ 5000mAh సామర్థ్యంతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ అంబాటులో ఉంది. ఈ ఫోన్ ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుంది. ఇది రెండు మెమరీ-స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. అవి 4జీబీ+ 128జీబీ, 8జీబీ + 128Gజీబీ. దీంతో పాటు వివో వీ 27 సిరీస్ కూడా విడుదల చేయనున్నట్లు సమచారం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..