ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం వేగంగా పెరిగింది. సమస్త ప్రపంచాన్ని మన చేతి వేళ్లతో చూసుకునేలా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లో గూగుల్ యాప్స్ ఉండడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ సేవలను ఆశ్వాదించడానికి కచ్చితంగా దాని వెబ్ బ్రౌజర్ క్రోమ్‌ను వాడాలి. అయితే క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న ఏజెన్సీ అయిన భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇటీవల క్రోమ్ వినియోగదారులకు అధిక-తీవ్రత హెచ్చరికను జారీ చేసింది. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ సంభావ్య భద్రతా ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరిస్తుంది. క్రోమ్ వినియోగదారులు వారి సున్నితమైన సమాచారాన్ని రాజీ చేసే వివిధ భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నారని ఏజెన్సీ పేర్కొంది. ఈ సమస్య కారణంగా ఫిషింగ్ దాడులు, డేటా ఉల్లంఘనలు, మాల్వేర్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వినియోగదారులు ఈ దాడుల నుంచి జాగ్రత్తగా ఉండటంతో తాము రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని వివరిస్తున్నారు. కాబట్టి ఈ మాల్వేర్ దాడుల నుంచి ఎలా రక్షణ పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..