Egg Freezing: కాలం వేగంగా మారుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగానే సాంకేతికత ఓ రేంజ్‌లో అభివృద్ధి చెందోంది. చివరికి మనిషి పుట్టుకను కూడా టెక్నాలజీ మార్చేస్తోంది. దేవుడి సృష్టికి ప్రతి సృష్టిగా సంతానోత్పత్తికి కూడా సైన్స్‌ను జోడిస్తున్నారు. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే సరోగసి, ఎగ్ ఫ్రీజింగ్ విధానాలు. ఈ తరం జనరేషన్ వాళ్లు పిల్లల్ని కనడానికి అంత తొందర ఎందుకున్న ఆలోచనలో ఉంటున్నారు. అయితే ఆలస్యంగా పిల్లల్ని కంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ‘ఎగ్ ఫ్రీజింగ్’ అనే చికిత్స తెరపైకి వచ్చింది. మహిళలు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే వారి అండాలను సేకరించి శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేస్తారు. అనంతరం నచ్చినప్పుడు ఫెర్టిలిటీ చేసి తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇప్పుడీ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. వయసు పెరిగినా కొద్ది అండోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్న కారణంతోనే ఈ ఎగ్ ఫ్రీజింగ్ వైపు అడుగులు వేస్తున్నారు.
మరీ ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలను ప్లాన్ చేయడానికి ఇష్టపడని వారు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. సామాన్యుల కంటే సెలబ్రిటీలే ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ఇప్పుడు చాలా చోట్ల అండాలను నిల్వ చేసేందుకు ఐవీఎఫ్ సెంటర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పద్ధతికి ఆదరణ పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలోని చిలీలో గతేడాది కేవలం 4 నెలల్లోనే ఎగ్ ఫ్రీజింగ్ 50 శాతం పెరిగడం గమనార్హం.
వయసు పెరిగన తర్వాత పిల్లల్ని కనకుండా ముందుగానే అండాలను దాచుకోవడం అనే విధానం వినడానికి బాగానే ఉన్నా ఇది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. ఈ విషయమై హైదరాబాద్ అనూ టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ.. వయసులో ఉన్నప్పుడు అండాలను భద్రపరుచుకొని, తర్వాత గర్భం దాల్చినా ప్రమాదకరమనే అభిప్రాయాన్ని వెలువరిచారు. దీనికి కారణం అండం ఆరోగ్యంగా ఉన్నా 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం ఇబ్బందికి దారి తీస్తుందని, వయసులో ఉన్నప్పుడే గర్భం దాల్చడం మంచిదని ఆమె చెబుతున్నారు. ఇక ప్రస్తుత రోజుల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోయి గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 10 శాతానికి పెరిగిందని అనూరాధ తెలిపారు.
Gold Smuggling: గోల్డ్ స్మగ్లర్ల కొత్త దారులు.. ఈ సారి వారి ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..
Watermelon : చర్మ సంరక్షణ కోసం పుచ్చకాయ..! ఈ విధంగా వాడితే కాంతివంతమైన ముఖం మీ సొంతం..