Pebble Cosmos Vogue: మార్కెట్‌లో దూసుకొస్తున్న నయా స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లు

|

Jun 18, 2023 | 4:30 PM

భారతదేశంలో కాస్మోస్ వోగ్ స్మార్ట్‌వాచ్‌ను ప్రారంభించడంతో పెబుల్ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ స్మార్ట్ వాచ్ జింక్ అల్లాయ్ బాడీతో వస్తుంది. అలాగే ఇవి మాగ్నెటిక్ సిలికాన్ స్ట్రాప్స్ కావడం వల్ల చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.  పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,499గా ఉంది.

Pebble Cosmos Vogue: మార్కెట్‌లో దూసుకొస్తున్న నయా స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లు
Pebble
Follow us on

ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. గతంలో కేవలం సమయం చూడడానికి మాత్రమే ఉపయోగించే వాచ్‌లు తర్వాత మరింత స్మార్ట్‌గా మారడంతో వాటిల్లోనే వివిధ ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో యువత ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లపై ఆకర్షితులవుతున్నారు. యువత నుంచి వచ్చిన విపరీతమైన డిమాండ్‌కు అనుగుణంగా స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకూ తమ బ్రాండ్‌లో నూతన స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. భారతదేశంలో కాస్మోస్ వోగ్ స్మార్ట్‌వాచ్‌ను ప్రారంభించడంతో పెబుల్ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ స్మార్ట్ వాచ్ జింక్ అల్లాయ్ బాడీతో వస్తుంది. అలాగే ఇవి మాగ్నెటిక్ సిలికాన్ స్ట్రాప్స్ కావడం వల్ల చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.  పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,499గా ఉంది. ముఖ్యంగా ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్ పెబుల్ వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు . అలాగే ఈ స్మార్ట్ వాచ్ అబ్సిడియన్ బ్లాక్ , క్లాసిక్ గోల్డ్, జెట్ బ్లాక్, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో ఉంటుంది. ఈ వాచ్‌లో వచ్చే ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

పెబుల్ కాస్మోర్ వోగ్ వాచ్ ఫీచర్లు ఇవే

పెబుల్ కాస్మోర్ వోగ్ 1.96 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌వాచ్ ఏఐ వాయిస్ ఎనేబుల్ చేశారు. ముఖ్యంగా ఈ వాచ్ విజువల్ క్లారిటీని అందిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం స్మార్ట్‌వాచ్‌లో పెడోమీటర్, క్యాలరీ కౌంటర్ , హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ2, మానిటర్ మరియు స్లీప్ మానిటరింగ్ ఉన్నాయి. పెబుల్ కాస్మోస్ స్మార్ట్‌వాచ్ సోషల్ మీడియా, ఎస్ఎంఎస్ కోసం నోటిఫికేషన్‌లను కూడా చూపుతుంది. అలాగే స్మార్ట్‌వాచ్‌లో ఉన్న ఏఐ AI వాయిస్ అసిస్టెంట్ ఉంది ద్వారా స్మార్ట్‌వాచ్‌ను తాకకుండానే ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చే. ఈ పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్‌వాచ్ 240 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. అలాగే ఐపీ 67 సపోర్ట్‌తో నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. స్మార్ట్ వాచ్ 2 గంటల్లో ఛార్జ్ అవుతుంది. అలాగే ఏడు రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. రైజ్ హ్యాండ్ అవేక్, అలారం క్లాక్ రిమైండర్, సెడెంటరీ రిమైండర్, కెమెరా కంట్రోల్, ఫైండ్ ఫోన్, వెదర్ డిస్‌ప్లే, మ్యూజిక్ ప్లే కంట్రోల్ వంటి ఫీచర్లతో ఈ వాచ్ ఆకర్షణీయంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..