Children-Social Media: పలు అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు.. భారత్‌లో సోషల్ మీడియాకు బానిసగా మారుతున్న 10ఏళ్ల లోపు పిల్లలు

|

Jul 25, 2021 | 5:43 PM

Children-Social Media: ఫేస్ బుక్ ప్రపంచంలో ఎక్కడెక్కడో నివసిస్తున్న వారందరినీ ఒకటి చేసింది.. అయితే కుటుంబం లో ఎవరికీ ఎవరు కాకుండా చేసింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు,..

Children-Social Media: పలు అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు.. భారత్‌లో  సోషల్ మీడియాకు బానిసగా మారుతున్న 10ఏళ్ల లోపు పిల్లలు
Social Media
Follow us on

Children-Social Media: ఫేస్ బుక్ ప్రపంచంలో ఎక్కడెక్కడో నివసిస్తున్న వారందరినీ ఒకటి చేసింది.. అయితే కుటుంబం లో ఎవరికీ ఎవరు కాకుండా చేసింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, తక్కువ ధరకు డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియా ను ఉపయోగించేవారి సంఖ్య మరీ ఎక్కువఅయ్యింది. సోషల్ మీడియా ఉపయోగించడానికి చిన్న పెద్ద, ఆడ, మగ అనే తేడా లేదు.. అందరూ ప్రస్తుతం సోషల్ మీడియా లో మునిగితేలుతున్నారు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నవారిలో 10 ఏళ్ల వయస్సున్న వారు కూడా ఉన్నారు. స్మార్ట్ ఫోన్ వాడకంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చేసిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 ఏళ్ల వయస్సున్న పిల్లల్లో 37.8 శాతం మందికి ఫేస్ బుక్, 24.3 శాతం మందికి ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలు ఉన్నాయనే విషయం తెలిసింది.నిజానికి సోషల్ మీడియాలో ఖాతాలు తెరవడానికి వినియోగదారుడికి ఏజ్ లిమిట్ ఉంది. ఈ ఖాతాలు ఉపయోగించాలంటే..కనీస వయస్సు 13 ఏళ్లు ఉండాలి.

ఎన్సీపీఆర్ మొత్తం 5, 811 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. వారిలో 3, 491 మంది స్టూడెంట్స్, 1, 534 మంది తల్లిదండ్రులు, 786 మంది టీచర్లు, 60 పాఠశాలనుంచి అభిప్రాయాన్ని సేకరించారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఈ పరిశోధనలు జరిగాయి. 8 నుంచి 18 ఏళ్ల వయస్సున్న వారిలో 30.2 శాతం మంది సొంత ఫోన్లు కలిగి ఉన్నారని ఈ పరిశోధనల్లో తెలిసింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ను సోషల్ మీడియాను నిద్రపోయే ముందు వారే వారి సంఖ్యా అధికంగా అంటే 76.20 శాతం ఉంది. 23.80 శాతం నిద్రపోవడానికి ఫోన్ ను వాడుతుంటే.. 40 శాతం మంది మెసెంజర్లు, 31.30 శాతం మంది మ్యూజిక్, 20.80 శాతం మంది గేమ్స్, 31 శాతం మంది మెటీరియల్స్ కోసం వాడుతున్నట్లు తేలింది.

15.80 శాతం మంది రోజుకు 4 గంటలు, 5.30 శాతం మంది రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్ వాడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇక స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న మొత్తం బాలల్లో 94.08 శాతం మంది ఆన్ లైన్ క్లాసుల కోసం వాడుతున్నారని అధ్యయనంలో తెలిసింది.మొత్తానికి ఎక్కువమంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు, సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతోన్నారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఇది వారి శారీరక, మానసిక పరిష్టితికి మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా నిద్రపోవడానికి ముందు పిల్లలు ఫోన్ ఉపయోగిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని చైల్ సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Sonu Sood: మిల్క్ మ్యాన్‌గా మారిన సోనూ సూద్.. రిక్షా తొక్కుతూ రైతు సమస్యలను తెలుసుకున్న రియల్ హీరో