ప్రభుత్వ భవనంలో తహశీల్దార్ల మందు పార్టీ.. బీజేపీ నేతకు లింక్..?

వీకెండ్ వచ్చిన ఆనందమో ఏమో తెలీదు గానీ.. ప్రభుత్వ భవనంలో ఆరుగురు తహశీల్దారు మందు పార్టీ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ యువ మోర్చా సభ్యులు తీశారు. అది కాస్త వైరల్‌గా మారడంతో ఆ ఆరుగురికి డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. హోలెనర్సిపుర, సక్‌లేశ్‌పుర, అలూరు, హాసన్‌కు చెందిన ఆరుగురు తహశీల్దార్లు ఈ […]

ప్రభుత్వ భవనంలో తహశీల్దార్ల మందు పార్టీ.. బీజేపీ నేతకు లింక్..?
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 3:14 PM

వీకెండ్ వచ్చిన ఆనందమో ఏమో తెలీదు గానీ.. ప్రభుత్వ భవనంలో ఆరుగురు తహశీల్దారు మందు పార్టీ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ యువ మోర్చా సభ్యులు తీశారు. అది కాస్త వైరల్‌గా మారడంతో ఆ ఆరుగురికి డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది.

హోలెనర్సిపుర, సక్‌లేశ్‌పుర, అలూరు, హాసన్‌కు చెందిన ఆరుగురు తహశీల్దార్లు ఈ మందు పార్టీలో ఉన్నట్లు సమాచారం. అయితే తాము మందు పార్టీ చేసుకోలేదని అక్కడున్న శ్రీనివాస్ అనే తహశీల్దార్ చెప్పుకొచ్చాడు. కేవలం మాంసాహార పార్టీని మాత్రమే తాము చేసుకుంటామని.. కానీ బీజేపీ యువ మోర్చా సభ్యులు అనధికారికంగా అక్కడకు ప్రవేశించి కావాలనే గొడవ చేశారని వెల్లడించాడు. మరోవైపు ఈ వీడియోను తీసిన బీజేపీ యువమోర్చా జిల్లాధ్యక్షుడు నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం అదే బంగ్లాలో ఉన్న బీజేపీ నేతల పుట్టస్వామిని కలిసేందుకు నగేష్‌తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలోనే తహశీల్దార్ల పార్టీలోకి అతడు బలవంతంగా ప్రవేశించినట్లు సమాచారం. దీంతో ఈ పార్టీకి, బీజేపీ నేతకు ఏదైనా లింక్ ఉందేమోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.