ఓవర్సీస్‌లో డీలా పడ్డ ‘సైరా’.. కారణాలివేనా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్ల పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. ముఖ్యంగా విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు జల్లులు కురిపించారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద కూడా మెగాస్టార్ […]

ఓవర్సీస్‌లో డీలా పడ్డ 'సైరా'.. కారణాలివేనా..!
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 6:10 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్ల పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. ముఖ్యంగా విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు జల్లులు కురిపించారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద కూడా మెగాస్టార్ ప్రభంజనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈ చిత్రం 100కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ‘సైరా’కు మంచి కలెక్షన్లే వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హిందీలో మాత్రం ఈ చిత్రానికి అనుకున్నంత కలెక్షన్లు రావడం లేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించినప్పటికీ.. హృతిక్, టైగర్‌ల ‘వార్‌’లో సైరా కొట్టుకుపోతోంది.

ఇదంతా పక్కనపెడితే మరోవైపు ఓవర్సీస్‌లోనూ సైరా సత్తా చాటలేకపోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్ వద్ద చిరు గర్జన కొనసాగుతున్నప్పటికీ.. ఓవర్సీస్‌లో మాత్రం సైరా కలెక్షన్లు సోసోగానే ఉన్నాయి. సినిమా విడుదలై మూడు రోజులు పూర్తి అవ్వగా.. ఇప్పటివరకు 200kడాలర్ల(10కోట్లు) గ్రాస్‌ మాత్రమే కలెక్ట్ అయ్యింది. అయితే దాదాపు పదేళ్ల తరువాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ‘ఖైదీ నంబర్.150’కూడా ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లను సాధించింది. అంతేకాదు టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించని చిత్రాలలో ఖైదీ నంబర్. 150 ఇప్పటికీ టాప్ 10లో కొనసాగుతోంది. కానీ ఇప్పుడు మాత్రం సైరాకు మాత్రం అనుకున్నంత రేంజ్‌లో అక్కడ కలెక్షన్లు రావడం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఓవర్సీస్‌లో ఈ చిత్రం నాన్ హాలీడే సీజన్‌లో విడుదలైంది. దీంతో మూడు రోజులైనా కలెక్షన్లు తక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు. అలాగే థ్రిల్లర్, హారర్, వైవిధ్య కంటెంట్‌ ఉన్న సినిమాలకంటే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కథలనే అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ వస్తున్నారు. ఇది కూడా సైరా కలెక్షన్లకు ఒక కారణం అయ్యి ఉండచ్చన్నది మరికొందరి అభిప్రాయం. వీటితో పాటు ప్రమోషన్ కూడా పెద్దగా లేకపోవడంతోనే సైరా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకుల మాట. ఏది ఏమైనా.. ఇవాళ, రేపు అక్కడ వీకెండ్. మరి ఈ రెండు రోజుల్లోనైనా మెగాస్టార్ ప్రభంజనంతో ఓవర్సీస్‌లో సైరా రాణిస్తాడేమో చూడాలి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు