Breaking News
  • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
  • అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ ముద్దాడ రవిచంద్ర బదిలీ. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. బుడితి రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
  • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
  • అమెరికాలో జోరుగా సాగుతున్న ముందస్తు పోలింగ్‌. టెక్సాస్‌లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు. ఈనెల 13న మొదలైన ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ. ఇప్పటివరకు ఓటేసిన 70లక్షల మంది ఓటర్లు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఈ శతాబ్ధానికే పోలింగ్‌ శాతం రికార్డుగా మారుతుందన్న నిపుణులు . అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం .
  • టీవీ9 ఎఫెక్ట్‌: తూ.గో: ఈతకోట-గన్నవరం రహదారిపై గుంతల పూడ్చివేత . టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు . యుద్ధప్రాతిపదికన గోతులను పూడ్చుతున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు .
  • దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య అనారోగ్యంతో కన్నుమూత. నాయిని తో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అహల్య.. నాయిని అంతక్రియలకు వైద్యుల పర్యవేక్షణలో హాజరయిన అహల్య.

సూర్యకాంతం తెలుగు మూవీ రివ్యూ

Suryakantham Telugu Movie Review, సూర్యకాంతం తెలుగు మూవీ రివ్యూ

టైటిల్ : సూర్యకాంతం

తారాగణం : రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల, పెర్లెన్ భేసానియా, శివాజీ రాజా, సుహాసినీ తదితరులు

సంగీతం : మార్క్ కె రాబిన్

దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి

నిర్మాణ బ్యానర్ : నిర్వాణ సినిమాస్

 

ఇంట్రడక్షన్: మెగా డాటర్ నిహారిక కొణిదెల టైటిల్ రోల్ లో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ‌ :

అభి(రాహుల్ విజయ్)కి అనుకోని పరిస్థితులలో సూర్యకాంతం(నిహారిక కొణిదెల)తో పరిచయం ఏర్పడుతుంది. చిలిపితనం, అల్లరితనం కలిగిన సూర్యకాంతం అంటే అభికి చాలా ఇష్టం. ఇది ఇలా ఉంటే సూర్యకాంతంను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి(సుహాసిని) పోరు పెడుతుంది. అయితే ఆమె మాటలు సూర్యకాంతం వినదు. ఇలా ఉండగా ఒక రోజు సూర్యకాంతం తల్లి హార్ట్ ఎటాక్ తో చనిపోతుంది. దానితో సూర్యకాంతం ఒంటరి అవుతుంది. అప్పుడు అభి ఆమెకు అండగా నిలుస్తాడు. ఇక ఒక రోజు  సూర్యకాంతంకు తన ప్రేమ విషయం చెబుతాడు అభి. కానీ సూర్యకాంతం ఆ తర్వాత రోజు నుంచి కనబడదు. ఎక్కడికి వెళ్లిపోతుందో ఎవరికి తెలియదు. దానితో అభి కొద్దిరోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయి పూజ(పెర్లెన్ భేసానియా)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు.

అయితే సడన్ గా వారిద్దరి నిశ్చితార్ధం టైంలో రీ-ఎంట్రీ ఇస్తుంది సూర్యకాంతం. ఇక అభి అయితే తాను పూజను పెళ్లి చేసుకుంటున్నట్లు సూర్యకాంతంకు చెప్పలేడు. అనుకోని విధంగా ఒక రోజు సూర్యకాంతం అభికి ఐ లవ్ యు చెబుతుంది. దానితో షాక్ అయిన అభి అసలు విషయం చెబుతాడు. అప్పుడు సూర్యకాంతం ఏమి చేసింది.? అసలు సూర్యకాంతం ఎందుకు అలా సడన్ గా అభిని వదిలి వెళ్ళిపోయింది.?  అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు.? సూర్యకాంతం తన ప్రేమను గెలిపించుకుందా.? అనేవి సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు :

నిహారిక తన గత చిత్రాల కంటే ఈ చిత్రంలో బాగా నటించిందని చెప్పాలి. ముఖ్యంగా కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో ఆమె చక్కని హావభావాలు కనబరిచింది. ఇక రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శివాజీ రాజా, సుహాసిని, సత్య మరియు తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కని నటన కనబరిచారు.

విశ్లేష‌ణ‌ :

కథ మొత్తం నిహారిక చుట్టూనే తిరిగేలా రాసుకున్నాడు డైరెక్టర్ ప్రణీత్. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. హీరో హీరోయిన్లు మధ్య ప్రేమ సన్నివేశాలు, అప్పుడప్పుడు వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులకు రీలీఫ్ కలిగిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. అంతేకాదు ఎమోషన్స్ కూడా పెద్ద పండలేదు. కాబట్టి సినిమా బోరింగ్ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం బాగా డీల్ చేశాడు దర్శకుడు ప్రణీత్.

సాంకేతిక విభాగాల పనితీరు:

సాంకేతిక విభాగాల పనితీరు గురించి చెప్పాలంటే… ఎడిటింగ్ మరింత షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. ఇక కెమెరా వర్క్ బాగుంది. మార్క్ రాబిన్ అందించిన సంగీతం యావరేజ్ అనే చెప్పాలి, అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం డీసెంట్. కాగా నిర్వాణ సినిమాస్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

ప్రధాన పాత్రధారులు నటన

కొన్ని కామెడీ సీన్స్

క్లైమాక్స్

మైనస్‌ పాయింట్స్‌ :

స్లో నెరేషన్

Related Tags