‘మిస్టర్‌ ఐపీఎల్‌’ సురేశ్‌రైనా మరో రికార్డు

ఐపీఎల్‌ మ్యాచుల్లో 5,000 పరుగులు చేసి మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న సురేశ్‌రైనా తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ పృథ్వీ షా క్యాచ్‌ అందుకున్న రైనా ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో మరే ఆటగాడు ఇన్ని క్యాచులు అందుకోలేదు. రైనా తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 84, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ 82 క్యాచ్‌లు […]

‘మిస్టర్‌ ఐపీఎల్‌’ సురేశ్‌రైనా మరో రికార్డు
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 5:11 PM

ఐపీఎల్‌ మ్యాచుల్లో 5,000 పరుగులు చేసి మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న సురేశ్‌రైనా తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ పృథ్వీ షా క్యాచ్‌ అందుకున్న రైనా ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో మరే ఆటగాడు ఇన్ని క్యాచులు అందుకోలేదు. రైనా తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 84, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ 82 క్యాచ్‌లు అందుకున్నారు. వికెట్ కీపర్ల విషయానికొస్తే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మాత్రమే 100 క్యాచ్‌లు అందుకున్నాడు. తన కెరీర్‌లో 189వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న రైనా 37 బంతుల్లో 59 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. సురేశ్‌ రైనా మొదట్నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకే ఆడుతున్నాడు. చెన్నై జట్టు నిషేధం ఎదుర్కొన్న సమయంలో గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.