దిశ కేసులో స్వతంత్ర విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశం

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ‘ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్‌పూర్‌కర్ ఆధ్వర్యాన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరపాలని సూచించింది. ఈ పానెల్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 6 నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే, తదుపరి ఉత్తర్వులు జారీ […]

దిశ కేసులో స్వతంత్ర విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 12, 2019 | 2:37 PM

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ‘ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్‌పూర్‌కర్ ఆధ్వర్యాన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరపాలని సూచించింది. ఈ పానెల్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 6 నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు మరే ఇతర అథారిటీ కానీ, కోర్టు గానీ దీనిపై విచారణ జరపరాదని కోర్టు స్పష్టం చేసింది. అంటే..ఎనిమిది మంది సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ సిట్ ‘ గానీ, జాతీయ మానవ హక్కుల సంఘం గానీ జరిపే విచారణను పక్కన పెట్టినట్టే..

ఎన్ కౌంటర్ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని తాము భావిస్తున్నామని చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ పేర్కొంది. పోలీసులు దోషులని తాము అనడంలేదని, అయితే విచారణ జరగాలని కోరుతున్నామని జస్టిస్ బాబ్డే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన పైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘ ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేయబోతున్నామని మీరు అంటే.. దానితో తమకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అయితే అమాయకులు నిజాన్ని తెలుసుకోగోరుతున్నారని మీరు వాదించిన పక్షంలో.. వాస్తవాల జోలికి మాత్రం తాము వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. పోలీసుల తరఫున వాదించిన అడ్వొకేట్ ముకుల్ రోహ్తగి.. గతంలో కోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించిందని, అయితే అది ఇన్వెస్టిగేషన్ పర్యవేక్షణకు ఉద్దేశించిందని అన్నారు. ఒక న్యాయమూర్తి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.  ఎన్ కౌంటర్ ను సవాలు చేస్తూ అడ్వొకేట్లు జీ. ఎస్. మణి, ప్రదీప్ కుమార్ యాదవ్, ముఖేష్ కుమార్ శర్మ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది .తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ‘ సిట్ ‘ ఏర్పాటు చేసినందున ఇక రిటైర్డ్ జడ్జితో విచారణ అవసరం లేదన్న ముకుల్ రోహ్తగి అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చింది.