రైతు చట్టాలకే సుప్రీంకోర్టు కమిటీ అనుకూలం, అన్నదాతల ఆగ్రహం. అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

రైతుల అందోళనపై సుప్రీంకోర్టు  ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ పూర్తిగా రైతు చట్టాలను సమర్థించింది. ఈ చట్టాలు అన్నదాతల మేలుకోసమే..

  • Umakanth Rao
  • Publish Date - 9:42 am, Wed, 13 January 21
రైతు చట్టాలకే సుప్రీంకోర్టు కమిటీ అనుకూలం, అన్నదాతల ఆగ్రహం. అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

Farmers Protest: రైతుల అందోళనపై సుప్రీంకోర్టు  ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ పూర్తిగా రైతు చట్టాలను సమర్థించింది. ఈ చట్టాలు అన్నదాతల మేలుకోసమే ఉన్నాయని పేర్కొంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని అభిప్రాయపడింది. రైతుల డిమాండ్లను, కేంద్ర అభిప్రాయాలను ఆలకించి ఈ కమిటీ తగిన సిఫారసులు చేస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఈ సంఘంతో గానీ, ఈ సభ్యులతో గానీ తాము చర్చించే ప్రసక్తే లేదని రైతు సంఘాలు కరాఖండిగా స్పష్టం చేశాయి. ఇందులోని సభ్యులంతా చట్టాలకు, ప్రభుత్వానికి అనుకూలురేనని ఈ సంఘాలు చెబుతున్నాయి. చట్టాలను రద్దు చేయాలనీ మేము ఒకవైపు చెబుతుంటే కమిటీ ఏర్పాటు ప్రక్రియ ఏమిటని ఈ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ మాన్, వ్యవసాయవేత్తలు  ప్రమోద్ కుమార్ జోషీ, అశోక్ గులాటీ, షెట్కారీ సంఘటన్ చీఫ్ అనిల్ ఘన్వాట్  సభ్యులుగా ఉన్నారు. వీరిలో గులాటీ 1999 నుంచి 2001 వరకు ప్రధాని ఎకనమిక్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా వ్యవహరించారు. ఈ కమిటీ 10 రోజుల్లో సమావేశమై రెండు నెలల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

Read More:

Silver Rates Today: పరుగులు పెడుతున్న వెండి.. పెరుగుతున్న సిల్వర్ ధరలు.. కిలో రేటు ఎంతంటే ?

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు.. బుకింగ్ చేసుకున్న గంటలోనే గ్యాస్ డెలివరీ..

Importance of Bhogi Festival : భోగి మంటలెందుకు?.. భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి?.. మన సంప్రదాాయాల వెనుక అంతరార్ధం ఇదే..