గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు.. బుకింగ్ చేసుకున్న గంటలోనే గ్యాస్ డెలివరీ..

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇక కొన్ని రోజుల్లో సూపర్ గుడ్ న్యూస్ రానుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన గంటలోనే మీ ఇంటకి గ్యాస్ డెలివరీ

  • Rajitha Chanti
  • Publish Date - 8:13 am, Wed, 13 January 21

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇక కొన్ని రోజుల్లో సూపర్ గుడ్ న్యూస్ రానుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన గంటలోనే మీ ఇంటకి గ్యాస్ డెలివరీ కాబోతుంది. ఇందుకోసం ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తత్కాల్ సేవ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ తత్కాల్ సేవలను అందించడానికి వీలుగా ప్రతి రాష్ట్రంలోనూ కనీసం ఒక పట్టణం లేదా జిల్లాను గుర్తించాల్సి ఉంది. దీంతో కస్టమర్లకు గ్యాస్ బుక్ చేసిన 30 నుంచి 40 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్‏ను అందిస్తాం అని ఐఓసీఎల్ టాప్ మేనేజ్ మెంట్ తెలిపింది.

ఇక ఈ తత్కాల్ సేవలు ఎప్పుటి నుంచి అందుబాటులోకి వస్తాయో అని మాత్రం ఖచ్చితంగా తెలియలేదు. ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఖాతాదారులు 14 కోట్ల వరకు ఉన్నారు. ఇప్పటీకే ఈ ఇండియన్ ఆయిన్ తన కస్టమర్లకు ఇండేన్ గ్యా్స్ రూపంలో ఎల్‏పీజీ గ్యాస్ సిలిండర్ సర్వీసులు అందిస్తుంది. ఈ తత్కాల్ సేవతో సింగిల్ సిలిండర్ ఉపయోగించేవారికి భారీ ఊరట లభించనుంది. సింగిల్ సిలిండర్ వాడే వారికి అది అయిపోయిన వెంటనే మరో సిలిండర్ అందేలా యోచిస్తోంది.

Also Read: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఎల్‏పీజీ గ్యాస్ సిలిండర్లపై అదిరిపోయే ఆఫర్స్.. బుకింగ్ చేస్తే భారీ తగ్గింపు..

LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్