Breaking News
  • సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ నిలువబోతోంది. గజ్వేల్‌లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు-హరీష్‌రావు.
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్‌ ప్రెస్‌మీట్‌. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్‌ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్‌చేసుకోవచ్చ -ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌
  • రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
  • విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్‌ దాడులు ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్‌. కటక్‌కు చెందిన సమీర్‌కుమార్‌ ప్రధాన్‌, దుర్గారావు అరెస్ట్‌. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేస్తున్న నిందితులు ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు సీజ్‌చేసిన ఆర్పీఎఫ్‌
  • కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్‌గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్‌ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్‌వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • వరంగల్‌: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్‌రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్‌ బోల్తా. రాంపూర్‌కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.

‘ సూపర్-30 ‘ మూవీ..ఓ .మేథమెటీషియన్.. ఒక షాకింగ్ న్యూస్ !

Super30, ‘ సూపర్-30 ‘ మూవీ..ఓ .మేథమెటీషియన్.. ఒక షాకింగ్ న్యూస్ !

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ‘ సూపర్-30 ‘ మూవీ శుక్రవారం రిలీజయింది. బీహార్ కు చెందిన మేథమెటీషియన్ ఆనంద్ కుమార్ బయో పిక్ గా దర్శకుడు వికాస్ బెహల్ తీసిన ఈ చిత్రం అప్పుడే మంచి అంచనాలను చేరుకుంటోంది. అయితే.. ఈ సినిమాకు స్ప్హూర్తిమంతంగా నిలిచిన ఈ గణిత శాస్త్రజ్ఞుడి ఆరోగ్యానికి సంబంధించిన విషాద ఉదంతం ఇవాళే బయటికొచ్చింది. ఆనంద్ కుమార్ ఓ బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్నారట.. ఎకౌస్టిక్ న్యూరోమా అనే అరుదైన ట్యూమర్ కారణంగా ఆయన కుడి చెవి క్రమంగా వినికిడి శక్తి కోల్పోతోందట. 2014 లో తన ఈ రుగ్మత గురించి మొదటిసారిగా తనకు తెలిసిందని, అప్పటినుంచి వివిధ ఆస్పత్రుల్లో ఎన్నో టెస్టులు చేయించుకున్నానని ఆయన తెలిపారు. పాట్నాలోని సాధారణ ఆస్పత్రుల నుంచి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రివరకు ఎన్నో సార్లు చికిత్సలు పొందుతూ వచ్చానని చెప్పారు.తన చెవి నుంచి మెదడుకు దారితీసే నాడిలో ఏర్పడిన ట్యూమర్ (కణితి) క్యాన్సర్ కాకపోయినా..ఇది మరింత ముదిరితే తీవ్రమైన తలనొప్పి, నీరసం, చివరకు పక్షవాతంకూడా సోకవచ్ఛునని డాక్టర్లు చెప్పారని ఆనంద్ కుమార్ వెల్లడించారు. ‘ నువ్వు మరో పదేళ్లు మాత్రమే బతుకుతావు ‘ అని వైద్యులు చెప్పినప్పుడు తన నవనాడులూ కుంగిపోయాయన్నారు. ప్రస్తుతం ఆనంద్ కుమార్ వయస్సు 46 ఏళ్ళు.’.నేను జీవించి ఉండగానే ఈ బయోపిక్ తీయాలని బాలీవుడ్ మేకర్స్ ని కోరాను.. నా డైలీ లైఫ్ పై హీరో హృతిక్ రోహన్ 150 గంటల వీడియో తీయడం నాకెంతో ఆనందం కలిగించింది ‘ అని ఆయనచెప్పారు. ఒక అద్భుత గణిత శాస్త్రజ్ఞుడి బయోపిక్ విడుదలైన రోజే ఆయన చెప్పిన ఈ విషయాలు ముఖ్యంగా బాలీవుడ్ కి, ఆయన అభిమానులకు షాకింగ్ న్యూసే..