ఐఫా వేడుకల్లో ‘అనుకోని అతిథి’.. అదీ ’సెలబ్రిటీయే’ మరి..!

Stray Dog who stole Salman Khan limelight at IIFA awards 2019, ఐఫా వేడుకల్లో ‘అనుకోని అతిథి’.. అదీ ’సెలబ్రిటీయే’ మరి..!

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(ఐఫా).. 20వ ఎడిషన్ వేడుకలు ఇటీవల ఘనంగా ముగిశాయి. ఆ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు చాలా మంది హాజరై సందడి చేశారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం కోసం వెళ్లిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గ్రీన్ కార్పెట్ ద్వారా లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన అటు వెళ్తూనే అనుకోని అతిథిగా ఓ వీధి కుక్క కూడా వెనకాలే వచ్చింది. దీంతో అక్కడున్న కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ మన్నాయి.

ఇక ఆ తరువాత ఆ కుక్కను నటి అదితి భాటియా ఇంటర్వ్యూ చేసింది. ‘‘హాయ్… ఇక్కడకు అనుకోని అతిథి వచ్చారు. తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం’’ అంటూ అదితి.. ఆ కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది. వాటికి సమాధానంగా… తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆ శునకం. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వీడియోకు నెటిజన్లు ‘‘వావ్.. క్యూట్.. నీ ఎంట్రీ అదుర్స్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

Spread love! 🐶❤️

A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *