Jaggery with Curd: పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..? ఓసారి ట్రై చేయండి..

పెరుగు, బెల్లం తింటే గంటల తరబడి కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయకపోవటంతో అతిగా తినకుండా అడ్డుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే, పెరుగు, బెల్లం కలిపి తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే పెరుగు, బెల్లం తినాలి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తుంది.

Jaggery with Curd: పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..? ఓసారి ట్రై చేయండి..
Jaggery With Curd
Follow us

|

Updated on: Apr 26, 2024 | 8:18 PM

పెరుగు మనం నిత్యం తినే ఆహార పదార్థాల్లో అతి ముఖ్యమైనది. చాలా మందికి ఆహారంలో పెరుగు లేనిదే భోజనం పూర్తి కాదు. పెరుగుతో మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఎక్కువమంది పెరుగును అన్నంతో కలిపి తీసుకుంటారు. కొందరు పెరుగులో ఉప్పు, పంచదార కలిపి తింటారు.. అయితే, మీరు ఎప్పుడైనా పెరుగులో బెల్లం కలిపి తింటే ఎలా ఉంటుందో రుచి చూశారా..? అంతేకాదు..పెరుగులో బెల్లం కలిపి తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగు, బెల్లం రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగు, బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.

శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా అంటే రక్తహీనతతో బాధపడుతున్నవారికి బెల్లం, పెరుగు తినడం వల్ల మేలు జరుగుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. పెరుగులో ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ ఉన్నాయి. పెరుగు బెల్లం కలిపి తినటం వల్ల రక్తహీనతను తొలగిస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు అంటే రక్తహీనత ఉన్నవారు పెరుగు, బెల్లం తినాలి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. అంతేకాదు.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు మలబద్ధకం, విరేచనాలు, వాంతులు సర్వసాధారణం. ఇలాంటి సమయంలో పెరుగు, బెల్లం రోజువారీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పైగా బరువు తగ్గడంలో కూడా పెరుగు బెల్లం సహాయపడుతుంది. మీరు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతుంటే, మీ రోజువారీ ఆహారంలో బెల్లం పెరుగుతో కలిపి తినటం అలవాటుగా చేసుకోంది. పెరుగు, బెల్లం తింటే గంటల తరబడి కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయకపోవటంతో అతిగా తినకుండా అడ్డుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే, పెరుగు, బెల్లం కలిపి తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే పెరుగు, బెల్లం తినాలి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..