జుట్టు రాలడానికి కారణాలు..

TV9 Telugu

07 May 2024

తల చర్మం జుట్టు కుదుళ్లకు, జుట్టుకు మధ్య లింక్, చుండ్రు, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లపై శ్రద్ధ వహించాలి. పొడి స్కాల్ప్ చుండ్రుకు దారితీస్తుంది.

అధికంగా జిడ్డుగల స్కాల్ప్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అనుకూలమైన ప్రదేశంగా మారుతుంది. ఈ సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది.

చాలా మంది దీనిని జుట్టు రాలడం అని అనుకుంటారు. అయితే, ఈ రకమైన జుట్టు రాలే సమస్యను వైద్య పరిభాషలో టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు.

ఇది తాత్కాలిక దశ. ఇది ఆరు నుంచి 9 నెలల వరకు ఉంటుంది. జుట్టు రాలే సమస్య అంతకంటే ఎక్కువ కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

స్కాల్ప్ ఎగ్జిమా వల్ల చర్మంపై దురద, పొడి, ఎర్రబడిన చర్మం వస్తుంది. దీనికి సాధారణ కారణాలు మితిమీరిన షాంపూ వాడకం, రసాయనాలను ఎక్కువగా ఉపయోగించడం.

ఇది తలపై చికాకు, వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధులకు చికిత్స చేయకపోతే.. శరీరంలోని వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతాయి.

రసాయన ఔషధాలకు బదులుగా హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. మృదువైన పళ్లు కలిగిని హెయిర్ బ్రష్ ఉపయోగించాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి.