అలా చేస్తే పాక్‌కు నీటి సరఫరా ఆగినట్టే..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు గగ్గోలు పెడుతున్న పాక్‌కు దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వబోతుంది భారత్. ఆ దేశానికి వెళ్లే నీటిని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. సింధూ జలాల ఒప్పందం-1960 ప్రకారం పశ్చిమ నదులు సింధూ, జీలం, చినాబ్ జలాలను పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అదే విధంగా బియస్, రావి, సట్లేజ్ నదుల నీటిని భారత్ వాడుకోవచ్చు. అయితే మన నదీ జలాలను సక్రమంగా వినియోగించుకోకపోగా వాటిని దయతో పాక్‌కు పంపుతున్నాం. ఇటీవల జమ్ము కశ్మీర్ […]

అలా చేస్తే పాక్‌కు నీటి సరఫరా ఆగినట్టే..
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 3:32 AM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు గగ్గోలు పెడుతున్న పాక్‌కు దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వబోతుంది భారత్. ఆ దేశానికి వెళ్లే నీటిని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. సింధూ జలాల ఒప్పందం-1960 ప్రకారం పశ్చిమ నదులు సింధూ, జీలం, చినాబ్ జలాలను పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అదే విధంగా బియస్, రావి, సట్లేజ్ నదుల నీటిని భారత్ వాడుకోవచ్చు. అయితే మన నదీ జలాలను సక్రమంగా వినియోగించుకోకపోగా వాటిని దయతో పాక్‌కు పంపుతున్నాం.

ఇటీవల జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దచేస్తూ రాజ్యంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ తీరులో అనేక వివాదాస్పద మార్పులు వచ్చాయి. వీటన్నిటిపై సుధీర్ఘంగా ఆలోచించిన కేంద్రం.. పాక్‌కు వెళ్తున్న నీటిని కట్ చేయాలని భావిస్తోంది. బియాస్, రావి, సట్లేజ్ నదుల నీటిని వాడుకునేందుకు రావి నదిపై షాపూర్-కండి దగ్గర జలాశయాన్ని నిర్మిస్తున్నారు. అక్కడినుంచి మూడు నదుల జలాలను ఆ జలాశయంలోకి తరలిస్తారు. అటునుంచి యూజేహెచ్ ప్రాజెక్టుకు తరలించి జమ్మూకశ్మీర్, పంజాబ్ ప్రజలకు సరఫరా చేయనున్నారు. ఇక మిగిలిన జలాలను యమునా నదికి మళ్లిస్తారు. ఈ వివరాలను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ వెల్లడించింది. ఇదంతా జరిగితే పాక్‌కు భారత్ దయతో ఇస్తున్న నీళ్లు ఆగిపోనున్నాయి.