Breaking News
  • అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్: ప‌్ర‌పంచం మెచ్చిన గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ న‌గ‌రం అవ‌త‌రిస్తోంది. రాష్ర్ట ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ‌లో అత్యంత వేగంగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ చెందింది. తెలంగాణ ప‌ట్ట‌ణీక‌ర‌ణ 42.6 శాతానికి చేరుకుంది. దేశ స‌గ‌టు ప‌ట్ట‌ణ జ‌నాభా 31.2 శాతం మాత్ర‌మే. తెలంగాణ‌లో అనేక పాల‌న సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టింది. పెరుగుతున్న ప‌ట్ట‌ణీక‌ర‌ణ దృష్ట్యా 74 కొత్త మున్సిపాలిటీలు, 7 కొత్త మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసింది. రాష్ర్టంలో 142 పుర‌పాలిక‌ల‌కు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేస్తూ ఉపాధి క‌ల్ప‌న‌ను పెంపొందిస్తున్నాం. క‌ట్టుదిట్ట‌మైన శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అమ‌లు చేస్తున్నాం. ఈ క్ర‌మంలో ప్ర‌పంచం మెచ్చిన గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ అవ‌త‌రిస్తోంది.
  • విశాఖ: సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసు . నిందితులకు కోర్టులో చుక్కెదురు. డాక్టర్ నమ్రత సహా 15 మంది బెయిల్ నిరాకరణ. నిందితులు వేసుకున్న బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన కోర్ట్.
  • హిమాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ అవసరం లేదు. హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్.
  • విశాఖ: శిరోముండనం కేసు. నూతన్ నాయుడుకు బెయిల్ నిరాకరణ. బెయిల్ కోరుతూ 8 మంది నిందితుల పిటిషన్.. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్ట్.
  • సింగీతం శ్రీనివాస‌రావుకు కోవిడ్ పాజిటివ్‌: సెప్టెంబ‌ర్ 9న కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించిన సింగీతం. ఈ నెల 21న సింగీతం పుట్టిన‌రోజు. ఈ నెల 22న హోమ్ ఐసొలేష‌న్ పూర్త‌వుతుంద‌ని సింగీతం వెల్ల‌డి. చిన్న‌పాటి ఇన్‌ఫెక్ష‌న్ ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఇంట్లోనే ప్ర‌త్యేక గ‌దిలో ఉన్న‌ట్టు వెల్ల‌డించిన సింగీతం. తానెప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాన‌ని వెల్ల‌డించిన సింగీతం. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటే హాస్ట‌ల్ రోజులు గుర్తుకొస్తున్నాయ‌ని చ‌మ‌త్క‌రించిన సింగీతం. సింగీతం శ్రీనివాస‌రావుకి 88 ఏళ్లు. కోవిడ్ ప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌. మాస్కులు ధ‌రించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని వెల్ల‌డి.
  • చెన్నై నుండి కోలకొత్తాకి కంటైనర్ లో సెల్ ఫోన్ తరలింపు. కాజా టోల్ గేట్ వద్ద కంటైనర్ లోకి చొరబడి సెల్ ఫోన్ లు దొంగలిస్తున్న ముఠా. వెనుక వస్తున్న లారీ వాళ్ళు గుర్తించి కంటైనర్ డ్రెవర్ సమాచారం చేరవేత. కంటైనర్ డ్రైవర్ అప్రమత్తమయ్యేలోపే పరారైన దొంగల ముఠా. కంటైనర్ రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలింపు. దొంగలని పట్టుకునేందుకు అప్రమత్తమైన పోలీసులు.
  • హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి ప్రారంభ ముహూర్తం ఖరారు . 19వ తేదీన సాయంత్రం 5గంటలకి మంత్రి ktr చేతులమీదుగా ప్రారంభం . గత నెల 4న ప్రారంభం కావాల్సి ఉన్న ప్రణబ్ సంతాప దినాలు కావడంతో వాయిదా. రోడ్ no45 నుండి దుర్గం చెరువు కి కనెక్టివిటీ . దేశంలోనే రెండవ అతి పెద్దగా తీగల వంతెన గా..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.

శ్రావణి కేసు: ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్‌కి పంపనున్నారు
Sravani Suicide case, శ్రావణి కేసు: ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

Sravani Suicide case: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. మరికాసేపట్లో ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌కి తీసుకురానున్నారు. కోర్టులో ప్రవేశపెట్టి ఆ తరువాత రిమాండ్‌కి తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్‌ని రెడీ చేసిన పోలీసులు.. అందులో దేవరాజ్ రెడ్డిని ఏ1గా, సాయిరెడ్డిని ఏ2గా, అశోక్ రెడ్డిని ఏ3గా చేర్చారు. ఇక ఈ కేసులో శ్రావ‌ణి త‌ల్లిదండ్రుల‌ను నిందితులుగా చేర్చడానికి కుద‌ర‌దని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

కాగా ఈ నెల 9న శ్రావణి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. దేవరాజు వేధింపుల వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారితో పాటు సాయి రెడ్డి కూడా దేవరాజుపై ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసులో ఆడియో టేప్‌లు బయటికి రావడం.. అందులో దేవరాజు, సాయి, అశోక్‌ రెడ్డిల వేధింపులతోనే శ్రావణి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది. ఇక వాటి ఆధారంగా దర్యాప్తును చేసిన పోలీసులు ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చారు. ఇందులో దేవరాజ్‌, సాయి రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు. ఇక గత వారం రోజులుగా అశోక్ రెడ్డి అఙ్ఞాతంలో ఉండగా.. ఈరోజు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more:

ప్రారంభమైన ఆర్జీవీ బయోపిక్‌.. కెమెరా స్విచ్ఛాన్ చేసిన వర్మ తల్లి

సెలవులు కావాలి.. మన్మోహన్ సహా 14 మంది ఎంపీల దరఖాస్తు

 

Related Tags