IPL-2021 Player Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2021 వేలంకు రంగం సిద్దమైంది. ఈ నెల 18న చెన్నై వేదికగా నిర్వహించనున్న మినీ వేలం కోసం క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఇందులో 292 మందికి మాత్రమే అనుమతి దక్కింది. వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. వీరిలో సీనియర్లు మొదలు.. జూనియర్ల వరకు ఉన్నారు.
అయితే, ఆప్ఘనిస్తాన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ నూర్ అహ్మద్(16) బీసీసీఐ విడుదల చేసిన 292 మంది జాబితాలో అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. బీబీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నూర్ అహ్మద్ బీసీసీఐ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కుమారుడు నయన్ దోషి(42) అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. వీరిద్దరు కూడా రూ. 20 లక్షల కనీస ధర జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Also read: