ఆసుపత్రిలో చేరిన వెస్టిండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా

| Edited By:

Jun 25, 2019 | 3:45 PM

వెస్టిండీస్ దిగ్గజం, మాజీ క్రికెటర్ బ్రెయిన్ లారా ఆసుపత్రిలో చేరారు. తీవ్ర ఛాతి నొప్పితో బాధపడుతోన్న ఆయనను ఈ మధ్యాహ్నం 12.30గంటలకు ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుండగా.. లారా ఆరోగ్య పరిస్థితిపై కాసేపట్లో ఆసుపత్రి యాజమాన్యం నివేదికను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లారా ఇటీవల ముంబయి వచ్చారు. అక్కడే ఉండగానే ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని […]

ఆసుపత్రిలో చేరిన వెస్టిండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా
Follow us on

వెస్టిండీస్ దిగ్గజం, మాజీ క్రికెటర్ బ్రెయిన్ లారా ఆసుపత్రిలో చేరారు. తీవ్ర ఛాతి నొప్పితో బాధపడుతోన్న ఆయనను ఈ మధ్యాహ్నం 12.30గంటలకు ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుండగా.. లారా ఆరోగ్య పరిస్థితిపై కాసేపట్లో ఆసుపత్రి యాజమాన్యం నివేదికను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లారా ఇటీవల ముంబయి వచ్చారు. అక్కడే ఉండగానే ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.