సోషల్ మీడియాలో… నెం.1 స్థానంలో కోహ్లీ!

| Edited By:

Aug 18, 2019 | 6:44 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు.. వెలుపల కూడా అరుదైన రికార్డ్స్‌ని నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే ఆర్జనలో భారత మేటి క్రీడాకారుడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ అత్యధిక ఫాలోయర్స్‌ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన కోహ్లి.. వన్డే కెరీర్‌లో 43వ శతకం మార్క్‌ని అందుకోవడంతో పాటు ఒక దశాబ్దంలో 20వేల పరుగులు చేసి ఏకైక క్రికెటర్‌గా ఘనత సాధించిన విషయం తెలిసిందే. […]

సోషల్ మీడియాలో... నెం.1 స్థానంలో కోహ్లీ!
Follow us on

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు.. వెలుపల కూడా అరుదైన రికార్డ్స్‌ని నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే ఆర్జనలో భారత మేటి క్రీడాకారుడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ అత్యధిక ఫాలోయర్స్‌ ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన కోహ్లి.. వన్డే కెరీర్‌లో 43వ శతకం మార్క్‌ని అందుకోవడంతో పాటు ఒక దశాబ్దంలో 20వేల పరుగులు చేసి ఏకైక క్రికెటర్‌గా ఘనత సాధించిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లి‌ని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా దాదాపు 9 కోట్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ తరహాలో ఏ క్రికెటర్‌ని కూడా అభిమానులు అనుసరించడం లేదు. విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ట్విట్టర్‌లో సచిన్‌‌ని 30.1 మిలియన్ మంది ఫాలో అవుతుండగా.. ఫేస్‌బుక్‌లో 28 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 16.5 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరి తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (ట్విట్టర్ 7.7, ఫేస్‌బుక్ 20.5, ఇన్‌స్టాగ్రామ్ 15.4) మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి: