టీమిండియా క్రికెటర్ అభిషేక్ నాయర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరపున ఆడిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్ అన్ని రకాల ఫార్మట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 3 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5,749 పరుగులు చేయగా.. అందులో 13 సెంచరీలు ఉన్నాయి. అంతేకాక బౌలింగ్‌లో 173 వికెట్లు పడగొట్టాడు. అటు రంజీ ట్రోఫీలో కూడా పలు రికార్డులను అభిషేక్ నాయర్ సొంత చేసుకున్నాడు.
‘నేను రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోషియేషన్‌కు లేఖ ద్వారా తెలియజేశాను. నెల రోజుల క్రితమే నా నిర్ణయాన్ని వారికి తెలిపాను’ అని అభిషేక్ వివరించాడు. ఇన్నాళ్ల నా కెరీర్‌కు తోడ్పడిన కోచ్‌లు, టీమ్‌మేట్స్, కుటుంబసభ్యులు, స్నేహితులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నాడు.
మరోవైపు అభిషేక్ నాయర్.. ఐపీఎల్‌లో ముంబై తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. తన నిలకడైన ఆటతీరుతో ముంబైకి అద్భుత విజయాలు కూడా అందించాడు.
Veteran Mumbai all-rounder Abhishek Nayar has retired from first-class cricket. https://t.co/mEhDVlRajN
— Cricbuzz (@cricbuzz) October 23, 2019