టీమిండియాకు కొత్త కోచ్‌గా టామ్ మూడీ..?

|

Jul 18, 2019 | 7:37 PM

వరల్డ్‌కప్ 2019లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో జట్టులోని డొల్లతనం బయటపడింది. దీనితో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా హెడ్ కోచ్‌తో సహా మిగిలిన పోస్ట్‌లు భర్తీ చేయడానికి దరఖాస్తులను జూలై 30 వరకు ఆహ్వానించింది. రవిశాస్త్రీతో సహా పలువురు హేమాహేమీలు కోచ్ పదవి రేస్‌లో నిలిచారు. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా టామ్ మూడీ ఖరారైయ్యారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళ్తే.. […]

టీమిండియాకు కొత్త కోచ్‌గా టామ్ మూడీ..?
Follow us on

వరల్డ్‌కప్ 2019లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో జట్టులోని డొల్లతనం బయటపడింది. దీనితో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా హెడ్ కోచ్‌తో సహా మిగిలిన పోస్ట్‌లు భర్తీ చేయడానికి దరఖాస్తులను జూలై 30 వరకు ఆహ్వానించింది. రవిశాస్త్రీతో సహా పలువురు హేమాహేమీలు కోచ్ పదవి రేస్‌లో నిలిచారు. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా టామ్ మూడీ ఖరారైయ్యారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అసలు వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న టామ్ మూడీ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. దీనితో ఈ వార్తలకు బలం చేకూరింది. టీమిండియా కోచ్‌గా టామ్ మూడీ బీసీసీఐ ఖరారు చేసిందని.. అధికారికంగా ప్రకటించడమే మిగిలివుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రీకి బోర్డు మొండిచెయ్యి చూపనుందా.. అనే చర్చ నెట్టింట్లో మొదలైంది.


అటు సన్‌రైజర్స్ హైదరాబాద్.. అస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించిన అతడు.. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్‌గా వ్యవహరించి.. ఆ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.