నాటి ఆసీస్ జట్టుకు అద్దంలా కోహ్లీసేన..

|

Oct 15, 2019 | 4:40 PM

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అనంతరం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. జట్టుకు వెన్నముకలా నిలుస్తూ.. భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కొనసాగిస్తూ ప్రత్యర్థి జట్టకు వణుకు తెప్పిస్తున్నాడు. ధోని సారధ్యంలో భారత్ ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఏకంగా సంచలనాలనే నమోదు చేసింది. ప్రత్యర్థి ఏదైనా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మొత్తం మూడు […]

నాటి ఆసీస్ జట్టుకు అద్దంలా కోహ్లీసేన..
Follow us on

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అనంతరం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. జట్టుకు వెన్నముకలా నిలుస్తూ.. భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కొనసాగిస్తూ ప్రత్యర్థి జట్టకు వణుకు తెప్పిస్తున్నాడు. ధోని సారధ్యంలో భారత్ ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఏకంగా సంచలనాలనే నమోదు చేసింది. ప్రత్యర్థి ఏదైనా.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మొత్తం మూడు విభాగాల్లోనూ సింహాల్లా విరుచుకుపడుతున్నారు. రోహిత్ శర్మ, ధావన్, విరాట్ కోహ్లీ, బుమ్రా, అశ్విన్, జడేజాలు జట్టుకు ఎంతో కీలకమైన ఆటగాళ్లుగా ఉన్నారు. అంతేకాక ఇప్పటి ఇండియా జట్టును ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తే.. 90వ దశకం ఆస్ట్రేలియా జట్టును చూసినట్లే ఉంటుంది.

అప్పట్లో స్టీవ్ వా రిటైర్మెంట్ తర్వాత.. ఆస్ట్రేలియా జట్టుకు రికీ పాంటింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి గుర్తింపును తెచ్చుకున్న పాంటింగ్.. ఆసీస్‌ను అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదురులేని జట్టుగా తయారు చేశాడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా.. వారి స్వదేశంలోనే మట్టి కరిపించారు. గిల్‌‌‌‌క్రిస్ట్, హేడెన్, పాంటింగ్, క్లార్క్, సైమండ్స్, మార్టిన్.. ఇలా ఒకరేమిటి టాప్ ఆర్డర్ నుంచి చివరి వరకు అందరూ కూడా అద్భుతంగా ఆడేవారు. అటు బౌలింగ్ విషయానికి వస్తే మె‌కెగ్రాత్, లీతో పాటు.. మిస్టరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఆస్ట్రేలియాకు ప్రధాన బలం. దాదాపు దశాబ్దన్నర కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను ఏకచత్రాధిపత్యంగా ఏలుతూ.. 5 వరల్డ్‌కప్ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకుంది.

ఇప్పుడు సరిగ్గా అదే మాదిరి టీమిండియా కూడా మిగతా జట్లను చెమటలు పట్టిస్తోంది. విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తూ.. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌గా మన్ననలు పొందుతున్నాడు. వన్డేల్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న అతడు.. టెస్టుల్లో కూడా నెంబర్ వన్‌పై కన్నేశాడు. ఏది ఏమైనా ఇప్పుడు టీమిండియాను అడ్డుకోవాలంటే మిగిలిన జట్లు వ్యూహాత్మక ప్రణాళికలు రచించక తప్పదు.