
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి వన్డేలో ఓటమిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతోన్న రెండో వన్డేలో జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ ఆడుతోన్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడంతో క్రీజును వీడాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ అనమోల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ చేతికి గాయమైంది.
క్యాచ్ డ్రాప్ అవ్వడంతో పాటు చేతి బంతితో పాటు నేలకు బలంగా తాకడంతో రోహిత్ శర్మ చేతి నుంచి రక్తం వచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫిజియో సూచనతో రోహిత్ శర్మ డగౌట్‌కి చేరుకున్నాడు. దీంతో రోహిత్ స్థానంలో రజత్ పటిదార్… సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కి వచ్చాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ వేలికి అయిన గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి వైద్యులు స్కానింగ్ తీశారు. ఈ రిపోర్ట్ వస్తే కానీ పరిస్థితి ఏంటో తెలియదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..