కోహ్లీ ది బెస్ట్.. కానీ స్మిత్ అంతకు మించి – లాంగర్

|

Aug 08, 2019 | 1:56 AM

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం తర్వాత టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆసీస్ మాజీ సారధి స్టీవ్ స్మిత్.. యాషెస్ తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించి తన సత్తా చాటుకున్నాడు. స్మిత్ సాధించిన ఈ శతకాలకు మాజీలందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు వంతు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ది వచ్చింది. మాజీ కెప్టెన్‌ను ఆయన ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మెన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్మిత్ ఏమాత్రం […]

కోహ్లీ ది బెస్ట్.. కానీ స్మిత్ అంతకు మించి - లాంగర్
Follow us on

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం తర్వాత టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆసీస్ మాజీ సారధి స్టీవ్ స్మిత్.. యాషెస్ తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించి తన సత్తా చాటుకున్నాడు. స్మిత్ సాధించిన ఈ శతకాలకు మాజీలందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు వంతు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ది వచ్చింది. మాజీ కెప్టెన్‌ను ఆయన ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మెన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్మిత్ ఏమాత్రం తీసిపోడని అన్నాడు. స్పిన్నర్‌గా కెరీర్‌ ప్రారంభించిన స్మిత్‌… ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన తీరును ప్రస్తావించాడు. ఏడాది తర్వాత టీమ్‌లో చోటు దక్కించుకుని తీవ్ర ఒత్తిడిలో ఏకాగ్రత కోల్పోకుండా చేసిన తాజా సెంచరీలు స్మిత్‌ను మరో మెట్టు ఎక్కించాయన్నాడు. ఇది కేవలం గొప్ప ఆటగాళ్లకే సాధ్యమని లాంగర్‌ కొనియాడాడు. స్మిత్‌ను నెట్స్‌లోనూ ఔట్‌ చేయడం సాధ్యం కాదని… ఈ విషయం ఇంగ్లండ్‌ ఆటగాళ్లను అడిగితే చెబుతారని అన్నాడు.

అటు రెండు వరుస సెంచరీలతో స్టీవ్ స్మిత్ టెస్ట్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలోకి వచ్చాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో అతడు 903 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. యాషెస్‌ తొలి టెస్టుకు ముందు స్మిత్‌ 857 పాయింట్లతో నాలుగో ర్యాంకులో ఉండటం గమనార్హం. ఈ జాబితాలో కోహ్లి (922 పాయింట్లు), కేన్‌ విలియమ్సన్‌ (913) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.