
IPL 2022: ఐపీఎల్లో భాగంగా నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్బీబీ విజయకేతనం ఎగరేసింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మైదానంలో ఓ ప్రేమకథ నడిచింది. RCB అభిమానికి ఓ అమ్మాయి మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేసింది. ఇది చూసిన అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాస్తవానికి చాలా సందర్భాల్లో అబ్బాయిలు మోకాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజ్ చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్‌గా జరిగింది. ఆ అమ్మాయి లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు మైదానంలోని అన్ని కెమెరాలు అటువైపునకు తిరిగాయి. ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. తర్వాత ఆ అమ్మాయి మోకాళ్లపై నిలబడి RCB అభిమాని అయిన తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఆ ప్రపోజల్‌ని అంగీకరించి అతడు ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు.
విచిత్రం ఏంటంటే మైదానంలో వారి ప్రేమకథ సుఖాంతంకాగా మరోవైపు చెన్నైపై ఆర్సీబీ విజయం సాధించింది. లైవ్ మ్యాచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. మ్యాచ్‌కి వ్యాఖ్యానం చేస్తున్న వెటరన్ క్రికెటర్లు కూడా వారి ప్రేమ గురించి మాట్లాడుకోవడం విశేషం. గతంలో కూడా క్రికెట్ మైదానంలో ఇలాంటి ప్రేమ సన్నివేశాలు చాలా జరిగాయి. క్రికెట్ ఫీల్డ్ నుంచి ప్రారంభమైన ఈ RCB అభిమానుల ప్రేమకథ చిరకాలం కొనసాగాలని అందరు కోరుకుంటున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి