షమీ సెల్యూట్.. కాట్రెల్ రియాక్షన్!

వరల్డ్‌కప్ 2019లో విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అతడు వికెట్ తీసిన ప్రతిసారి తనదైన శైలి ఆర్మీ సెల్యూట్‌తో వినూత్నంగా సంబరాలు చేసుకుంటాడు. అదే విధంగా వెస్టిండీస్ క్రికెటర్లు తమ సెలబ్రేషన్స్‌ను చాలా వినూత్నంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అందులోనూ కాట్రెల్ స్టైల్ మరింత డిఫరెంట్. తాజాగా జరిగిన భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌లో కూడా కాట్రెల్ వికెట్ తీసినప్పుడు సెల్యూట్ చేశాడు. ఇక ఆ సెల్యూట్‌ను అభిమానులు ఎంతగానో […]

షమీ సెల్యూట్.. కాట్రెల్ రియాక్షన్!

Updated on: Jun 29, 2019 | 11:32 AM

వరల్డ్‌కప్ 2019లో విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అతడు వికెట్ తీసిన ప్రతిసారి తనదైన శైలి ఆర్మీ సెల్యూట్‌తో వినూత్నంగా సంబరాలు చేసుకుంటాడు. అదే విధంగా వెస్టిండీస్ క్రికెటర్లు తమ సెలబ్రేషన్స్‌ను చాలా వినూత్నంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అందులోనూ కాట్రెల్ స్టైల్ మరింత డిఫరెంట్.

తాజాగా జరిగిన భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌లో కూడా కాట్రెల్ వికెట్ తీసినప్పుడు సెల్యూట్ చేశాడు. ఇక ఆ సెల్యూట్‌ను అభిమానులు ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కాట్రెల్ ఔటైన సమయంలో భారత్ బౌలర్ షమీ అదే తరహాలో సెల్యూట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. 9వ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన కాట్రెల్.. 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆ సమయంలో షమీ సరదాగా కాట్రెల్ చేసిన విధంగా ఆర్మీ సెల్యూట్ చేయడం.. అది చూసి జట్టు సభ్యులు నవ్వుకోవడం జరిగింది. తాజాగా షమీ తన సెల్యూట్‌ను అనుకరించడంపై కాట్రెల్ హుందాగా స్పందించాడు.

ట్విట్టర్ వేదికగా కాట్రెల్ స్పందిస్తూ.. ‘గ్రేట్ ఫన్ గ్రేట్ బౌలింగ్ అంటూ ట్వీట్ చేశాడు’. జమైకా డిఫెన్స్ ఫోర్స్‌లో సోల్జర్ అయిన కాట్రెల్ తన టీంకు గౌరవ సూచకంగా సెల్యూట్ చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఈ సెల్యూట్‌ను షమీ అనుకరించడంపై పలువురు మాజీలు తప్పుబట్టారు. అయితే కాట్రెల్ దీనికి హుందాగా స్పందించడం మెచ్చుకోదగ్గ విషయం. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగులు తేడాతో విజయం సాధించి.. సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది.