2022 T20 World Cup : వచ్చే ఏడాది టీ 20 వరల్డ్‌కప్‌ వేదికలు ఖరారు.. మెల్‌బోర్న్‌లో నవంబర్‌ 13న ఫైనల్‌..

| Edited By: Team Veegam

Nov 16, 2021 | 2:19 PM

ఇటీవల దుబాయి వేదికగా జరిగిన టీ- 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

2022 T20 World Cup :  వచ్చే ఏడాది టీ 20 వరల్డ్‌కప్‌ వేదికలు ఖరారు.. మెల్‌బోర్న్‌లో  నవంబర్‌ 13న ఫైనల్‌..
Follow us on

ఇటీవల దుబాయి వేదికగా జరిగిన టీ- 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఐసీసీ రెండేళ్లకొకసారి ఈ పొట్టి ప్రపంచకప్‌ నిర్వహిస్తోంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా టోర్నీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో మరో ఏడాదిలోనే టీ- 20 ప్రపంచకప్‌ జరగనుంది. తాజా ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను అక్కడి అధికారులు ఖరారు చేశారు. మొత్తం 7 నగరాల్లో ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతాయని, చారిత్రాత్మక మెల్‌బోర్న్‌ మైదానంలో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ నిర్వహిస్తామని ఐసీసీ ఈవెంట్స్‌ హెడ్‌ క్రిస్‌ టెట్లీ తెలిపారు.

మొత్తం 45 మ్యాచ్‌లు..
కాగా గతేడాది జరిగిన మహిళల టీ-20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియానే ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్ఫూర్తితోనే మరో ప్రతిష్ఠాత్మక టోర్నీని నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ టోర్నీలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. అడిలైడ్‌, బ్రిస్బేన్‌, పెర్త్‌, హోబర్ట్‌, సిడ్నీ, గీలాంగ్‌, మెల్‌బోర్న్‌ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. తాజా ఫైనల్‌లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో పాటు భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు నేరుగా సూపర్‌- 12కు అర్హత సాధిస్తాయి. మిగతా నాలుగు స్థానాల కోసం శ్రీలంక, వెస్టిండీస్‌ తదితర జట్లు క్వాలిఫయింగ్‌ టోర్నీల్లో తలపడనున్నాయి. సిడ్నీ, అడిలైడ్‌లలో సెమీస్‌లు జరగనుండగా, నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Also Read:

T20 World Cup 2021: కొన్నిసార్లు సూర్యోదయం కాస్త ఆలస్యం కావొచ్చు.. వార్నర్‎పై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్..

Cricket: షార్ట్‌ పిచ్‌ బంతికి ఎగిరి పడిన బ్యాటర్‌ హెల్మెట్‌.. తప్పిన ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో..

Rashid Khan: కేన్ మామ.. వార్నర్ కాకా.. వైరల్ అవుతోన్న రషీద్ ఖాన్ ట్వీట్..