Sania Mirza: ‘జీవిత‌కాల మ‌జిలీకి సిద్ధమ‌వుతున్న.. ఏమైనా పొరబాట్లు చేసి ఉంటే క్షమించండి’.. టెన్నిస్‌ దిగ్గజం సానియా

భార‌త టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్తల్లో నిలుస్తోంది. భ‌ర్త షోయాబ్‌ మాలిక్‌తో విడాకుల త‌ర్వాత సానియ లైఫ్‌ స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. అందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలే సాక్ష్యం. ఒంట‌రిత‌నాన్ని జ‌యించేందుకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సానియా మానసికంగా బలాన్ని పుంజుకోవడానికి దైవ చింతనపై దృష్టి నిలిపింది. ముస్లిం పవిత్ర స్థలమైన హ‌జ్ యాత్రకు వెళ్లనుంది. ఈ మేరకు..

Sania Mirza: 'జీవిత‌కాల మ‌జిలీకి సిద్ధమ‌వుతున్న.. ఏమైనా పొరబాట్లు చేసి ఉంటే క్షమించండి'.. టెన్నిస్‌ దిగ్గజం సానియా
Sania Mirza
Follow us

|

Updated on: Jun 09, 2024 | 7:39 PM

భార‌త టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్తల్లో నిలుస్తోంది. భ‌ర్త షోయాబ్‌ మాలిక్‌తో విడాకుల త‌ర్వాత సానియ లైఫ్‌ స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. అందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలే సాక్ష్యం. ఒంట‌రిత‌నాన్ని జ‌యించేందుకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సానియా మానసికంగా బలాన్ని పుంజుకోవడానికి దైవ చింతనపై దృష్టి నిలిపింది. ముస్లిం పవిత్ర స్థలమైన హ‌జ్ యాత్రకు వెళ్లనుంది. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ యాత్ర తర్వాత తాను మానసికంగా పరివర్తన చెంది తిరిగి రావాలనుకుంటున్నట్లు పోస్టులో తెల్పింది.

‘డియర్‌ ఫ్రెండ్స్‌, సన్నిహితుల్లారా.. మీకో న్యూస్. పవిత్రమైన హజ్‌ యాత్ర చేసే అవకాశం లభించింది. నేను పరివర్తన చెందేందుకు సిద్ధమవుతున్నాను. మీపట్ల ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. ఈ ఆధ్యాత్మిక జ‌ర్నీ ప‌ట్ల నేను కృత‌జ్ఞతా భావంతో ఉన్నాను. అల్లా నా పొర‌పాట్లను క్షమించి.. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటాడ‌ని న‌మ్ముతున్నా. జీవిత‌కాల మ‌జిలీకి సిద్ధమ‌వుతున్న. న‌న్ను మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. నేను మారిన హృద‌యం గ‌ల వ్యక్తిగా తిరిగొస్తాన‌ని ఆశిస్తున్నా’ అని సానియా త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

భార‌త టెన్నిస్‌లో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రస్‌ సానియా. సానియ తన కెరీర్‌లో ఆరు టైటిళ్లు గెల్చుకుంది. మ‌హిళ‌ల డ‌బుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ట్రోఫీల‌తో చ‌రిత్ర సృష్టించిన ఈ టెన్నిస్‌ దిగ్గజం పాక్ ఆల్‌రౌండ‌ర్ షోయబ్ మాలిక్‌తో ప్రేమ‌లో ప‌డి 2010లో అగడిని పెళ్లాడింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగగా 2018లో ఇజాన్ (కుమారుడు) జన్మించాడు. ఇంతలో షోయబ్‌ మరో పాక్‌ యువతి ప్రేమలో పడి సానియాకు విడాకులు ప్రకటించాడు. దీంతో సానియా, షోయ‌బ్‌లు త‌మ ప‌న్నెండేళ్ల వివాహబంధానికి ముగింపు ప‌లికారు. అనంతరం అదే ఏడాది షోయబ్‌ తన ప్రేయసిని పెళ్లాడాడు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!