ఒలింపిక్స్‌లో భారత్ కు గ్రేట్ డే.. జూలై 27న 7 క్రీడల్లో పోటీ.. క్వాలిఫయింగ్ రౌండ్ లో పివి సింధు సహా పలువురు దిగ్గజాలు..

జూలై 27వ తేదీన భారత జట్టు ఒలింపిక్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎక్కువ మంది క్వాలిఫికేషన్ రౌండ్ లేదా స్టేజ్ రౌండ్‌లో పాల్గొననున్నారు. అదే సమయంలో షూటింగ్ ఈవెంట్‌లో భారత్ పతకం కోసం ఆడనుంది. భారత అథ్లెట్లు జూలై 27వ తేదీ శనివారం రోజున మొత్తం 7 క్రీడల్లో పాల్గొననున్నారు. మొదటి ఈవెంట్ బ్యాడ్మింటన్ ఉంటుంది. షూటింగ్‌లో పతకం కోసం పోటీపడనున్నది భారత్

ఒలింపిక్స్‌లో భారత్ కు గ్రేట్ డే.. జూలై 27న 7 క్రీడల్లో పోటీ.. క్వాలిఫయింగ్ రౌండ్ లో  పివి సింధు సహా పలువురు దిగ్గజాలు..
India 27 July Schedule
Follow us

|

Updated on: Jul 26, 2024 | 8:27 PM

పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్‌తో భారత బృందం జర్నీ ప్రారంభమైంది. జూలై 25న పురుషుల ఆర్చరీ జట్టు నుంచి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ పాల్గొన్నారు. మహిళల జట్టుకు చెందిన దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్ తమ ప్రతిభను చూపించారు. ఈ ఈవెంట్‌లో రెండు జట్లూ టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. అయితే ఆర్చరీ వ్యక్తిగత ఈవెంట్‌లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అయితే ఒలింపిక్స్ లో అసలు ఆట రేపటి నుంచి (జూలై 27) ప్రారంభం కానుంది. జూలై 27వ తేదీన భారత జట్టు ఒలింపిక్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎక్కువ మంది క్వాలిఫికేషన్ రౌండ్ లేదా స్టేజ్ రౌండ్‌లో పాల్గొననున్నారు. అదే సమయంలో షూటింగ్ ఈవెంట్‌లో భారత్ పతకం కోసం ఆడనుంది.

ఏ ఆటలో ఏ ఆటగాళ్ళు పాల్గొంటారంటే..

భారత అథ్లెట్లు జూలై 27వ తేదీ శనివారం రోజున మొత్తం 7 క్రీడల్లో పాల్గొననున్నారు. మొదటి ఈవెంట్ బ్యాడ్మింటన్ ఉంటుంది. ఈ గేమ్‌లో పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తానీసా క్రెస్టో జోడీ బరిలోకి దిగనుంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో ఎస్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌లు పోటీపడనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ గ్రూప్ దశలో ఉంటాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి జియో సినిమా, స్పోర్ట్స్ 18లో భారత అథ్లెట్లు పోటీలను చూడవచ్చు.

షూటింగ్‌లో పతకం కోసం పోటీపడనున్న భారత్

బ్యాడ్మింటన్ తర్వాత రోయింగ్, షూటింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. రోవింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ హిట్స్ రౌండ్‌లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి బలరాజ్ పన్వార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సమయంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్ జరగనుంది. ఇందులో సందీప్ సింగ్, అర్జున్ బాబౌటా, రమితా జిందాల్, ఎలవెనిల్ వలరివన్ పాల్గొంటారు. ఈ క్రీడా పోటీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభంకానుంది. దీనిలో ఈ జట్టు అర్హత సాధిస్తే మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే నెక్స్ట్ రౌండ్ కు చేరుకుంటారు. ఒకవేళ ఈ రౌండ్ లో అడుగు పెడితే ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ భారత్ కు తొలి పతకాన్ని అందించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం దాదాపు ఖరారు

మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 మీటర్ల ఈథర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమాలు పోటీ పడనున్నారు. ఈ ఈవెంట్ ముగిసిన అనంతరం రెండు గంటల తర్వాత రిథమ్ సాంగ్వాన్, మను భాకర్ సాయంత్రం 4 గంటల నుంచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ రౌండ్‌లో పోటీ పడబోతున్నారు.

టెన్నిస్, టేబుల్ టెన్నిస్‌ పోటీలు ఎప్పుడంటే

జూలై 27న టెన్నిస్, టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ నాగల్ పాల్గొనున్నాడు. ఇక పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న , ఎన్ శ్రీరామ్ బాలాజీ పోటీపడనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో శరత్ కమల్, హర్మీత్ దేశాయ్ పాల్గొనబోతున్నారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో మనిక బాత్రా, శ్రీజ ఆకుల పోటీపడనున్నారు. టేబుల్‌ టెన్నిస్‌ మ్యాచ్‌ లు సాయంత్రం 6.30 గంటల నుంచి జరగనున్నాయి.

మహిళల బాక్సింగ్‌

రాత్రి 7 గంటల నుంచి 54 కేజీల మహిళల బాక్సింగ్‌ విభాగంలో ప్రీతి పవార్ రౌండ్ 32లో పాల్గొననుంది. చివరగా రాత్రి 9 గంటలకు టోక్యోలో 41 ఏళ్ల ఎదురు చూపులకు పతకంతో తెర దించిన భారత పురుషుల హాకీ జట్టు గ్రూప్ బిలో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒలింపిక్స్‌లో జూలై 27న భారత్ 7క్రీడల్లో పోటీ షూటింగ్‌లో పతకం కోసం
ఒలింపిక్స్‌లో జూలై 27న భారత్ 7క్రీడల్లో పోటీ షూటింగ్‌లో పతకం కోసం
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ! ఈ వైజాగ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటంటే?
బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ! ఈ వైజాగ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటంటే?
వైసీపీ ధర్నాకు ఇండి కూటమి నేతలు హాజరవ్వడంపై కొత్త ఈక్వేషన్‌
వైసీపీ ధర్నాకు ఇండి కూటమి నేతలు హాజరవ్వడంపై కొత్త ఈక్వేషన్‌
ఆగస్టు 3న హైదరాబాద్‌లో 'దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024'
ఆగస్టు 3న హైదరాబాద్‌లో 'దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024'
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
మదనపల్లి ఫైల్స్‌ దహనం కేసు లేటెస్ట్ అప్‌డేట్
మదనపల్లి ఫైల్స్‌ దహనం కేసు లేటెస్ట్ అప్‌డేట్
ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
బీ బోల్డ్ అంటున్న అంజలి.. ఫిఫ్టీన్‌ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న శృతి
బీ బోల్డ్ అంటున్న అంజలి.. ఫిఫ్టీన్‌ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న శృతి
రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి? శుభ సమయం?ప్రయోజనాలు ఏమిటంటే
రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి? శుభ సమయం?ప్రయోజనాలు ఏమిటంటే
నీ కష్టం పగోడికి కూడా రాకూడదు..బ్రో! చోరీకెళ్లి ఏం చేశాడో చూడండి
నీ కష్టం పగోడికి కూడా రాకూడదు..బ్రో! చోరీకెళ్లి ఏం చేశాడో చూడండి
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!