రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి? శుభ సమయం? నియమాలు? ప్రయోజనాలు ఏమిటంటే

రుద్రాక్ష ధరించడానికి ఉత్తమ సమయం ఉదయం. ఈ సమయంలో పర్యావరణం స్వచ్ఛంగా.. ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా రుద్రాక్ష శక్తి సులభంగా గ్రహించబడుతుంది. రుద్రాక్ష ధరించే ముందు పంచామృతం, గంగాజలంతో శుద్ధి చేయాలి. దీని తరువాత రుద్రాక్షను ఒక గుడ్డతో తుడిచి, రుద్రాక్షని తిలకంతో అలంకరించాలి. తర్వాత సూర్యరశ్మి తగేలా పెట్టుకోవాలి. తరువాత 108 సార్లు నమః శివాయ మంత్రాన్ని జపించండి. అనంతరం ఈ రుద్రాక్షను ధరించాలి.

రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి? శుభ సమయం? నియమాలు? ప్రయోజనాలు ఏమిటంటే
Rudraksha Niyamalu
Follow us

|

Updated on: Jul 26, 2024 | 7:51 PM

శ్రావణ మాసం పూజల మాసం.. ఈ నెలలో భోలాశంకరుడు తన భక్తుల పూజలకు సులభంగా ప్రసన్నుడవుతాడు. అందుకే శివ భక్తులు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ నెలలో రుద్రాక్షను ధరించడం ఈ నివారణ చర్యల్లో ఒకటి. రుద్రాక్ష అనేది శివునికి ఇష్టమైన ఆభరణం. ఇది రత్నం కంటే తక్కువ కాదు. ఈ నెలలో రుద్రాక్షను ధరించిన భక్తుల పట్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే రుద్రాక్ష ధరించడానికి నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రుద్రాక్షను తప్పుగా ధరిస్తే అది మీ జీవితంలో ఇబ్బందులను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో శ్రావణ మాసంలో రుద్రాక్షను ఎప్పుడు, ఎలా ధరించాలో తెలుసుకుందాం.

రుద్రాక్షను ఎప్పుడు ధరించాలంటే?

శ్రావణ మాసంలోని శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలతో పాటు రుద్రాక్షను ధరించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో శ్రావణ సోమవారం రోజున రుద్రాక్షను ధరించడం విశేషం. సోమవారం శివుని రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు రుద్రాక్షను ధరించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది.

రుద్రాక్ష ధరించడానికి సరైన సమయం

రుద్రాక్ష ధరించడానికి ఉత్తమ సమయం ఉదయం. ఈ సమయంలో పర్యావరణం స్వచ్ఛంగా.. ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా రుద్రాక్ష శక్తి సులభంగా గ్రహించబడుతుంది.

ఇవి కూడా చదవండి

రుద్రాక్ష ధరించే ముందు చేయాల్సిన పనులు

రుద్రాక్ష ధరించే ముందు పంచామృతం, గంగాజలంతో శుద్ధి చేయాలి. దీని తరువాత రుద్రాక్షను ఒక గుడ్డతో తుడిచి, రుద్రాక్షని తిలకంతో అలంకరించాలి. తర్వాత సూర్యరశ్మి తగేలా పెట్టుకోవాలి. తరువాత 108 సార్లు నమః శివాయ మంత్రాన్ని జపించండి. అనంతరం ఈ రుద్రాక్షను ధరించాలి.

రుద్రాక్ష ధరించడానికి నియమాలు

  1. రుద్రాక్ష నవ రత్నం కంటే తక్కువేం కాదు. దీనిని ధరించడానికి అనేక నియమాలను పాటించడం అవసరం. శ్రవణా మాసంలో రుద్రాక్ష ధరించడం ప్రారంభించడం చాలా శుభప్రదమని మత విశ్వాసం. విశ్వాసాల ప్రకారం శ్రావణ సోమవారం లేదా సావన్ శివరాత్రి రోజున కూడా రుద్రాక్షను ధరించడం చాలా శ్రేయస్కరం.
  2. దీని కోసం మొదట రుద్రాక్షను ఎర్రటి వస్త్రంపై ఉంచి దానిని పూజించే స్థలంలో లేదా శివలింగం వద్ద ఉంచి.. పంచాక్షరియైన ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. దీనిని గంగాజలంతో శుద్ధి చేసి తర్వాత పంచామృతంలో వేసి రుద్రాక్షను కొంత సమయం పాటు ఉంచండి.
  3. ఏదైనా కోరిక కోసం రుద్రాక్షను ధరిస్తున్నట్లు అయితే చేతిలో గంగాజలం తీసుకొని అందుకు సంబంధించిన కోరికను తెలిపి చేతిలోని రుద్రాక్షను పెట్టండి. గంగాజలంతో కడిగిన తర్వాత రుద్రాక్షను ధరించండి.
  4. రుద్రాక్ష ధరించేటప్పుడు తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించండి. రుద్రాక్ష ధరించిన తర్వాత రోజూ క్రమం తప్పకుండా ధ్యానం, సాధన చేయండి. ఇది రుద్రాక్ష శక్తిని పెంచుతుంది. తద్వారా దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
  5. రుద్రాక్షను చేతికి లేదా మెడలో ధరించాలనే నియమం ఉంది. చేతిలో (మణికట్టు) ధరించాలను కుంటే 12 రుద్రాక్షలను, మెడలో వేసుకోవాలంటే 54 రుద్రాక్షలు ఉండాలి. రుద్రాక్ష చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కనుక దీనిని ఎప్పుడూ అపవిత్రమైన చేతులతో తాకకూడదు. అంతేకాదు రుద్రాక్షను ఎరుపు రంగు దారంలో వేసి ధరించాలి.
  6. అంతేకాదు రుద్రాక్ష ధరించిన వ్యక్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రుద్రాక్ష ధరించిన వ్యక్తి ఎప్పుడూ మాంసాహారం, మద్యం సేవించకూడదు.
  7. ఎల్లప్పుడూ బేసి సంఖ్యలలో రుద్రాక్షను ధరించండి. రుద్రాక్ష జపమాల ధరించాలనుకుంటే.. రోజరీలో 27 రుద్రాక్షల కంటే తక్కువ ఉండకూడదు. ఇలా చేసిన వ్యక్తి శివ దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

రుద్రాక్ష శివునికి ఇష్టమైన ఆభరణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని హిందూ మత విశ్వాసం. పురాణ గ్రంథాల ప్రకారం రుద్రాక్ష ధరించిన వ్యక్తి దీర్ఘాయువుతో జీవిస్తాడు. అతని తేజస్సు కూడా పెరుగుతుంది. అంతేకాదు రుద్రాక్షను ధరించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. శని, రాహు, కేతు మొదలైన గ్రహాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రుద్రాక్ష ధరించడం వల్ల సంపద పెరుగుతుందని.. శత్రువుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. నియమాల ప్రకారం రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతికూలత దూరంగా ఉంటుంది. చెడు ఆలోచనలు మనస్సులో రావు. అంతేకాదు రుద్రాక్ష ధరించిన వ్యక్తికి అదృష్టము, శివుని ఆశీర్వాదం, సంపూర్ణ మద్దతు లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి? శుభ సమయం?ప్రయోజనాలు ఏమిటంటే
రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి? శుభ సమయం?ప్రయోజనాలు ఏమిటంటే
నీ కష్టం పగోడికి కూడా రాకూడదు..బ్రో! చోరీకెళ్లి ఏం చేశాడో చూడండి
నీ కష్టం పగోడికి కూడా రాకూడదు..బ్రో! చోరీకెళ్లి ఏం చేశాడో చూడండి
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
సునీతావిలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా? నాసా తాజాగా ఏంచెప్పిందంటే
సునీతావిలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి రాదా? నాసా తాజాగా ఏంచెప్పిందంటే
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా ఛాన్సుల్లేని నటి
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా ఛాన్సుల్లేని నటి
రమ్యకృష్ణ ఆ స్టార్ నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించారా..
రమ్యకృష్ణ ఆ స్టార్ నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించారా..
వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.!
వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.!
ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..
ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..
ఈ సీజన్‌లో మసాలా గ్రీన్ టీ బెస్ట్ ఎంపిక.. రెసిపీ మీ కోసం..
ఈ సీజన్‌లో మసాలా గ్రీన్ టీ బెస్ట్ ఎంపిక.. రెసిపీ మీ కోసం..
మొబైల్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌తో బాలిక మృతి..!
మొబైల్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌తో బాలిక మృతి..!
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం
పూల్‌ మఖానాతో లాభాలు ఫుల్‌.. హార్మోన్స్‌ ను బ్యాలెన్స్‌ కు ఉపయోగం